Share News

Gold Rates on Dec 28: బ్రేకులే లేనట్టు దూసుకుపోతున్న పసిడి, వెండి!

ABN , Publish Date - Dec 28 , 2025 | 06:43 AM

దేశంలో గత ఆరు రోజులుగా బంగారం, వెండి ధరల్లో ర్యాలీ కనిపిస్తోంది. రోజుకో కొత్త ఆల్ టైమ్ గరిష్ఠ స్థాయిని తాకుతున్నాయి. మరి నేడు ధరలు ఏ రేంజ్‌లో ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం పదండి.

Gold Rates on Dec 28: బ్రేకులే లేనట్టు దూసుకుపోతున్న పసిడి, వెండి!
gold silver all time high

ఇంటర్నెట్ డెస్క్: ఈ మధ్య కాలంలో బంగారం, వెండి ధరలు రోజూ ఓ కొత్త ఆల్ టైమ్ గరిష్ఠాన్ని నమోదు చేస్తున్నాయి. శనివారం కూడా ధరలు కొత్త పుంతలు తొక్కాయి. వరుసగా 6వ రోజూ ర్యాలీని కొనసాగించాయి. ఈ నెలలో బంగారం ధరలు ఏకంగా 7 శాతం మేర పెరిగ్గా, వెండి ధర రూ.2.5 లక్షల మార్కును దాటింది. ఇక గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, ఆదివారం ఉదయం 6.30 గంటల సమయంలో దేశంలో 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.1,41,220గా ఉంది. 22 క్యారెట్ 10 గ్రాముల వెండి ధర రూ.1,29,450 వద్ద తచ్చాడుతోంది. ఇక కిలో వెండి ధర నిన్నటితో పోలిస్తే దాదాపు రూ.11 వేల మేర పెరిగి రూ.2,51,000కి చేరుకుంది (Gold, Silver Rates on Dec 28).

అంతర్జాతీయ మార్కెట్‌లో 24 క్యారెట్ స్పాట్ గోల్డ్ ధర 4,549 డాలర్లను తాకి ఆల్ టైమ్ గరిష్ఠాన్ని నమోదు చేసింది. ఒక్క రోజులోనే దాదాపు 1.2 శాతం మేర పెరిగింది. వెండి ధర దాదాపు 9 శాతం మేర పెరిగి, 78.65 డాలర్ల వద్ద ఆల్ టైమ్ గరిష్ఠ స్థాయిని నమోదు చేసింది. సరఫరాలో కొరత, పారిశ్రామిక డిమాండ్‌ అధికం కావడంతో వెండి ధరలకు రెక్కలొచ్చాయి. మరోవైపు, భౌగోళిక రాజకీయ అనిశ్చితులు, ఫెడ్ వడ్డీ రేటులో కోత తప్పదన్న అంచనాలు, కేంద్ర బ్యాంకుల కొనుగోళ్లు, ఈటీఎఫ్‌లల్లోకి పెట్టుబడులు వెల్లువెత్తడం వంటి పరిణామాలు బంగారం ధరలను ఎగదోస్తున్నాయి.


ప్రధాన నగరాల్లో బంగారం ధరలు (24కే, 22కే, 18కే) ఇవీ

  • చెన్నై: ₹1,41,820; ₹1,30,000; ₹1,08,500

  • ముంబై: ₹1,41,220; ₹1,29,450; ₹1,05,920

  • న్యూఢిల్లీ: ₹1,41,370; ₹1,29,600; ₹1,06,070

  • కోల్‌కతా: ₹1,41,220; ₹1,29,450; ₹1,05,920

  • బెంగళూరు: ₹1,41,220; ₹1,29,450; ₹1,05,920

  • హైదరాబాద్: ₹1,41,220; ₹1,29,450; ₹1,05,920

  • విజయవాడ: ₹1,41,220; ₹1,29,450; ₹1,05,920

  • కేరళ: ₹1,41,220; ₹1,29,450; ₹1,05,920

  • పుణె: ₹1,41,220; ₹1,29,450; ₹1,05,920

  • వడోదరా: ₹1,41,270; ₹1,29,500; ₹1,05,970

  • అహ్మదాబాద్: ₹1,41,270; ₹1,29,500; ₹1,05,970

వెండి (కిలో) ధరలు

  • చెన్నై: ₹2,74,000

  • ముంబై: ₹2,51,000

  • న్యూఢిల్లీ: ₹2,51,000

  • కోల్‌కతా: ₹2,51,000

  • బెంగళూరు: ₹2,51,000

  • హైదరాబాద్: ₹2,74,000

  • విజయవాడ: ₹2,74,000

  • కేరళ: ₹2,74,000

  • పుణె: ₹2,51,000

  • వడోదరా: ₹2,51,000

  • అహ్మదాబాద్: ₹2,51,000


గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు మార్కెట్లలో ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. కాబట్టి, బంగారం కొనుగోలు చేసే సమయంలో ధరలను మరోసారి పరిశీలించగలరు.

ఇవీ చదవండి:

ఈ విషయాలు తెలుసా? పర్సనల్ లోన్ చెల్లించకుండానే రుణగ్రహీత మరణిస్తే..

సూపర్.. ప్రపంచంలో నెం.3 స్థానానికి చేరిన వెండి! ఏకంగా..

Updated Date - Dec 28 , 2025 | 07:06 AM