Share News

Personal Finance: కొత్త ఏడాది ఈ ఆర్థిక చిట్కాలు పాటించండి.. సంపన్నులవ్వండి..

ABN , Publish Date - Dec 31 , 2024 | 11:36 AM

కొత్త సంవత్సరం 2025 రానే వచ్చింది. అయితే ఈ ఏడాది మీరు ఎలాటి విషయాలు పాటిస్తే మీకు ఆర్థిక మేలు జరుగుతుంది. అందుకోసం ఏం చేయాలి, ఎలాంటివి పాటించాలనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

Personal Finance: కొత్త ఏడాది ఈ ఆర్థిక చిట్కాలు పాటించండి.. సంపన్నులవ్వండి..
Personal Finance tips

2025 నూతన సంవత్సర (new year 2025) వేడుకల కోసం అందరూ ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. అయితే ప్రతి ఏటా అనేక మంది పెట్టుబడి లేదా పొదుపు చేయాలని భావిస్తారు. కానీ పలు రకాల ఖర్చుల కారణంగా అది కుదరకుండా పోతుంది. ఈ నేపథ్యంలో మీరు మీ ఆర్థిక పరిస్థితిని వచ్చే ఏడాది మెరుగు పరుచుకోవడానికి ఎలాంటి చిట్కాలను (Financial Tips) పాటించాలనేది ఇక్కడ తెలుసుకుందాం. మీరు కొన్ని నిర్ణయాలను క్రమం తప్పకుండా పాటించడం ద్వారా మీ ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది.


1. బడ్జెట్ అంచనా

జనవరి ప్రారంభంలోనే మీరు మీ ఆదాయాన్ని, ఖర్చులను అంచనా వేసుకోండి. ముఖ్యమైన ఖర్చుల కోసం మీ ఆదాయాన్ని పక్కన పెట్టండి. అనవసర ఖర్చులను సాధ్యమైనంత మేరకు తగ్గించండి. దీంతోపాటు అత్యవసర ఖర్చుల కోసం కూడా కొంత పక్కన పెట్టుకుంటే ఇబ్బందులు లేకుండా ఉంటారు. ముందే బడ్జెట్ రూపొందించుకోవడం వల్ల మీ అంచనా ఖర్చులు తెలిసి ఒత్తిడి లేకుండా ఉంటారు.

2. తప్పనిసరి పొదుపు

మీ వేతనం వచ్చిన తర్వాత ముందుగా చేయాల్సిన పని పొదుపు చేయడం. ఖర్చులు చేసిన తర్వాత మిగిలినది సేవ్ చేద్దామని అనుకుంటే మాత్రం సేవ్ చేయడం కష్టంగా మారుతుంది. ఎందుకంటే ప్రతి నెలలో కూడా మిగిలిన మొత్తంతో ఏదో ఒకటి తీసుకోవాలని అనుకోవడం వంటి కారణాల వల్ల పొదుపుకు ఆటంకం ఏర్పడుతుంది. కాబట్టి సాలరీ వచ్చిన తర్వాత ముందే సేవింగ్ మొత్తాన్ని పక్కన పెట్టుకుంటే మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు.


3. లోన్స్ తగ్గించడం

మీకు ఏదైనా పెద్ద లోన్ వుంటే దానిని త్వరగా తీర్చుకోవడానికి ప్రయత్నించండి. అధిక వడ్డీ క్రెడిట్ కార్డ్ లేదా భారీ వడ్డీ రేట్ల లోన్స్ క్లియర్ చేసుకోవడానికి ప్లాన్ చేయండి. ప్రతి నెల కొంత మొత్తం కట్టడం లేదా తక్కువ వడ్డీ లోన్స్ తీసుకుని వాటిని క్లియర్ చేసుకోవచ్చు. దీంతోపాటు అధిక వడ్డీ రుణాలు తీసుకునే విషయంలో జాగ్రత్త వహించండి.

4. పెట్టుబడుల విభజన

ఇది మీకు కొన్ని కొత్త పాఠాలు నేర్పిస్తుంది. మ్యూచువల్ ఫండ్స్, రియల్ ఎస్టేట్, గోల్డ్ వంటి వివిధ ఆస్తుల్లో పెట్టుబడి పెడితే ఆర్థిక భరోసా ఉంటుంది. దీంతోపాటు మీ పెట్టుబడులను అవసరాలకు అనుగుణంగా విస్తరించుకుంటే మంచి లాభాలను పొందవచ్చు.


5. ఖర్చుల గుర్తింపు

ప్రతి నెలా మీ ప్రధాన ఖర్చులను గుర్తించండి. వాటిలో అనవసర ఖర్చులు (విలాసాల కోసం) ఏమున్నాయో తెలుసుకుని సాధ్యమైనంత వరకు వాటిని తగ్గించుకునే ప్రయత్నం చేయండి. దీంతో మీ ఆదాయం మిగులుతుంది. దీంతో మీ ఆర్థిక నష్టాలను అరికట్టవచ్చు.

6. కొత్త నైపుణ్యాల అభివృద్ధి

కొత్త ఏడాది మీ ఉద్యోగ జీవితానికి సంబంధించి కొత్త నైపుణ్యాలను నేర్చుకోండి. ఇలా చేయడం ద్వారా మీకు మరిన్ని అవకాశాలు పెరుగుతాయి. దీంతో మీ వేతనం కూడా పెరిగే అవకాశం ఉంటుంది.


7. సాంకేతికత వినియోగం

ప్రస్తుతం అనేక యాప్స్ రోజు వారీ ఖర్చుల ట్రాకింగ్, నిర్వహణ కోసం అందుబాటులో ఉన్నాయి. వీటి వినియోగం ద్వారా మీరు ఎప్పటికప్పడూ మీ నెలవారీ ఖర్చులు, ఆదాయలను అంచనా వేసుకోవచ్చు. వీటిని సమర్థంగా ఉపయోగించుకుంటే మీ పనులు మరింత సులభం అవుతాయి. దీంతోపాటు టెక్నాలజీ వాడకంతో మీ ఉద్యోగ పనులను కూడా ఈజీగా చేసుకోవచ్చు.

8. ప్రత్యేక ఆఫర్లు

సంవత్సరం మొదట మీరు ఏదైనా వాహనం లేదా ఇతర వస్తువులు తీసుకోవాలని చూస్తే ముందుగా ఆఫర్ల గురించి తెలుసుకోండి. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ విధానంలో ధరలు ఎలా ఉన్నాయో సరిపోల్చుకుని కొనుగోలు విషయంలో నిర్ణయం తీసుకోండి. ఆఫర్లు ఉన్నప్పుడు కొనుగోలు చేస్తే కొంత ఖర్చులను తగ్గించుకోవచ్చు.


ఇవి కూడా చదవండి:

Stock Market: 2024 సంవత్సరాంతపు ట్రేడింగ్ సెషన్‌.. కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు


Major Changes: 2025లో బిగ్ ఛేంజేస్.. తెలుసుకోకుంటే మీకే నష్టం..


Personal Finance: జస్ట్ నెలకు రూ. 3500 సేవ్ చేస్తే.. రూ. 2 కోట్లు మీ సొంతం..

Investment Tips: రూ. 20 వేల శాలరీ వ్యక్తి.. ఇలా రూ. 6 కోట్లు సంపాదించుకోవచ్చు..


Personal Finance: రూ. 10 వేల పొదుపుతో రూ. 7 కోట్ల సంపాదన.. ఎలాగో తెలుసా..

Read More Business News and Latest Telugu News

Updated Date - Dec 31 , 2024 | 11:42 AM