Virat Kohli Properties: కోహ్లీ ఆస్తులు చూస్తే కళ్లు చెదరాల్సిందే..
ABN, Publish Date - May 12 , 2025 | 06:29 PM
Virat Kohli Properties: క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లి ఆస్తులు చూస్తే కళ్లు చెదరాల్సిందే. కోహ్లీ విలాసవంతమైన జీవితం అతని సంపదకు నిదర్శనం. ముంబైలోని వర్లిలో రూ.34 కోట్లు విలువైన అపార్ట్‌మెంట్ ఉంది.
భారత క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీ.. టీ20 అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయిన తర్వాత..టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ కావాలనే తన ఉద్దేశ్యాన్ని ఇప్పటికే భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)కి తెలియజేశాడు. క్రికెట్ మైదానంలో సెంచరీలు, సిక్సర్లతో అభిమానులను అలరించిన కోహ్లీ.. ఆర్థికంగా కూడా బాగా సంపాదించాడు. అతడు గతేడాది అంటే.. 2024లో రూ. 66 కోట్లు ముందస్తు పన్ను చెల్లించాడు.
విరాట్ కోహ్లీ నికర ఆస్తుల విలువ దాదాపు రూ.1050 కోట్లని అంచనా. గతేడాది రూ. 66 కోట్లు ముందస్తు పన్నులు చెల్లించడం ద్వారా అత్యధిక పన్ను చెల్లించే క్రికెటర్‌గా విరాట్ కోహ్లీ రికార్డు సృష్టించాడు. కోహ్లీ BCCIకు చెందిన A+ గ్రేడ్ క్రికెటర్ కావడంతో.. ఏడాదికి రూ.7 కోట్లు సంపాదించాడు.
కెప్టెన్సీ ద్వారా..
టెస్ట్ మ్యాచ్‌కు రూ.15 లక్షలు, వన్డే మ్యాచ్‌కు రూ. 6 లక్షలు, టీ 20 మ్యాచ్‌కు రూ. 3 లక్షలు అతడు తీసుకుంటాడు. ఇక ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సిబి) జట్టు ప్రతి సీజన్‌కు రూ.15 -17 కోట్లు సంపాదిస్తుంది. క్రికెట్ ద్వారా ఏటా దాదాపు రూ. 25 కోట్లు సంపాదిస్తుంది. కోహ్లీ క్రికెట్ కెరీర్ 123 టెస్టుల్లో 9,230 పరుగులు, 30 సెంచరీలతోపాటు కెప్టెన్సీ ద్వారా 40 వరకు విజయాలను అందుకున్నాడు.
ప్రచార కర్తగా..
ఇక కోహ్లీ దాదాపు 40 పెద్ద బ్రాండ్లకు ప్రచారకర్తగా ఉన్నాడు. ఆ జాబితాలో Puma, Audi, MRF, Pepsi, Manyavar, Vivo, Myntra ఉన్నాయి. ఒక ప్రకటనకు అతడు రూ. 10 కోట్లు తీసుకుంటారు. సోషల్ మీడియాలో కోహ్లికి భారీగా అభిమానులు ఉన్న సంగతి అందరికి తెలిసిందే. స్పాన్సర్డ్ పోస్టుకు రూ. 8 -10 కోట్లు వచ్చే అవకాశం ఉంది.
భారీగా పెట్టుబడులు..
కోహ్లీ తెలివైన పెట్టుబడులు అతని సంపదను భారీగా పెంచాయి. బ్లూ ట్రైబ్, చిసెల్ ఫిట్‌నెస్, డిజిట్ ఇన్సూరెన్స్, స్పోర్ట్స్ కాన్వో, యూనివర్స్ స్పోర్ట్స్‌బిజ్ వంటి స్టార్టప్‌లలో సైతం అతడు పెట్టుబడులు పెట్టారు.
వ్యాపారాల ద్వారా..
అతను ముంబైలోని 'వన్8 కమ్యూన్' రెస్టారెంట్, FC గోవా (ఇండియన్ సూపర్ లీగ్), టెన్నిస్, రెజ్లింగ్ జట్లు వంటి క్రీడా సంస్థలలో పాల్గొన్నాడు. ఈ వ్యాపారాలు ఏటా భారీ ఆదాయాన్ని తెస్తాయి. కోహ్లీ వన్8 బ్రాండ్, ఫిట్‌నెస్ ఉత్పత్తులు, ఫ్యాషన్ లైన్లు సైతం ప్రజాదరణ పొందాయి.
ముంబై, ఢిల్లీలలో..
కోహ్లీ విలాసవంతమైన జీవితం అతని సంపదకు నిదర్శనం. ముంబైలోని వర్లిలో రూ.34 కోట్లు విలువైన అపార్ట్‌మెంట్ ఉంది. రూ. 100 కోట్లకుపైగా విలువైన బంగ్లా ఉంది. అలాగే గురుగ్రామ్‌లో రూ. 80 కోట్ల విలువైన భవనంతోపాటు అలీబాగ్‌లో రూ. 30 కోట్లు విలువైన భవనం ఉన్నాయి.
భార్య ఆస్తులు సైతం కోట్లలో..
కోహ్లీ వద్ద బెంట్లీ కాంటినెంటల్ GT, ఆడి R8 LMX, రేంజ్ రోవర్ వోగ్, ఆడి Q8, ఆడి S5 వంటి ఖరీదైన కార్లు సైతం ఉన్నాయి. రోలెక్స్, ఒమేగా తదితర లగ్జరీ గడియారాలను సైతం అతడు సేకరించాడు. అతడి భార్య బాలీవుడ్ నటి అనుష్క శర్మ.. నికర ఆస్తి విలువ రూ.306 కోట్లు ఉంటుంది.
ఇవి కూడా చదవండి..
AP SSC Supplimentary Exams hall tickets: టెన్త్ సప్లిమెంటరీ పరీక్షల హాల్‌టికెట్లు విడుదల
Operation Sindoor: మళ్లీ అడ్డంగా దొరికిన పాక్..
Operation Sindoor: పాక్ ఎయిర్ బేస్‌ల ధ్వంసం.. వీడియోలు విడుదల
Operation Sindoor: పాక్ దాడులను సమర్థంగా తిప్పికొట్టాం: ఎయిర్ మార్షల్ ఎ.కె. భార్తీ
For Sports News And Telugu News
Updated Date - May 12 , 2025 | 06:31 PM