ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

IPL Cheerleader Video: ఐపీఎల్ మ్యాచ్ రద్దు.. చీర్‌లీడర్ వీడియో వైరల్..

ABN, Publish Date - May 09 , 2025 | 11:27 AM

India Pakistan War: పాకిస్థాన్‌తో పాటు పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రస్థావరాల మీద భారత్ చేసిన దాడుల్ని సహించలేకపోయింది దాయాది. ఇండియాను టార్గెట్‌గా చేసుకొని కౌంటర్ అటాక్‌ మొదలుపెట్టింది. అయితే ఆ దాడుల్ని అంతే సమర్థంగా తిప్పికొడుతోంది భారత్.

IPL Cheerleader

ఇండో-పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. యుద్ధ వాతావరణం ఏర్పడటంతో ఐపీఎల్-2025లో మొదటిసారి ఓ మ్యాచ్‌ను రద్దు చేశారు. ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్-ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్‌ మధ్యలోనే రద్దయింది. సేఫ్టీ రీజన్స్‌తోనే మ్యాచ్‌ను ఆపేశామని హిమాచల్ క్రికెట్ బోర్డు స్పష్టం చేసింది. ఆడియెన్స్ అంతా స్టేడియం నుంచి వెళ్లిపోవాలని ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమాల్ రిక్వెస్ట్ చేశాడు. దీంతో ప్లేయర్లు, సపోర్ట్ స్టాఫ్, ప్రేక్షకులు అంతా గ్రౌండ్‌ను ఖాళీ చేశారు. ఈ తరుణంలో ఓ చీర్‌లీడర్ స్టేడియంలో తీసిన సెల్ఫీ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.


ప్లేయర్ల పరిస్థితేంటి..

ప్లేయర్లు ఫోర్లు, సిక్సులు కొడుతుంటే డ్యాన్సులు చేస్తూ ప్రేక్షకులకు కిక్ ఇచ్చే చీర్‌లీడర్స్ పంజాబ్-ఢిల్లీ మ్యాచ్ రద్దవడంతో షాక్ అయ్యారు. స్టేడియం అంతా ఖాళీగా మారింది, మ్యాచ్ మధ్యలోనే అందర్నీ పంపించేశారు, ఇక్కడంతా భయంగా ఉందంటూ వారిలోని ఓ చీర్‌లీడర్ ఒక వీడియోలో చెప్పుకొచ్చింది. బాంబుల భయంతో కొందరు అరుస్తూ వెళ్లిపోయారని, ధర్మశాలను వదిలి వెళ్లడం బాధగా ఉందని వాపోయిందామె. ఐపీఎల్ నిర్వాహకులు కరెక్ట్ పని చేశారని మెచ్చుకుంది. అయితే తాను ఎందుకు ఏడవడం లేదో తెలియడం లేదని.. ఇప్పటికీ తాను షాక్‌లోనే ఉన్నానంటూ ఆ చీర్‌లీడర్ చేసిన కామెంట్స్‌‌తో వీడియో వైరల్‌గా మారింది. కాగా, ఎయిర్‌పోర్ట్స్ మూసేయడంతో ధర్మశాల నుంచి ఆటగాళ్లను ప్రత్యేక రైలులో తరలిస్తోంది బీసీసీఐ. ఉనా స్టేషన్ నుంచి రెండు జట్ల ప్లేయర్లు, సపోర్ట్ స్టాఫ్‌, మ్యాచ్ అఫీషియల్స్‌ను వందే భారత్ రైలులో తరలిస్తున్నట్లు తెలుస్తోంది.


ఇవీ చదవండి:

విరాళాాలు అడుక్కుంటున్న పాక్

ఆపరేషన్ సిందూర్‌పై బాలీవుడ్‌లో వార్

భారత్, పాక్ యుద్ధం.. కిమ్ సపోర్టు ఎవరికి..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 09 , 2025 | 11:35 AM