ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Virat Kohli On BCCI: తలతిక్క రూల్స్ అవసరమా.. బీసీసీఐపై కోహ్లీ సీరియస్

ABN, Publish Date - Mar 16 , 2025 | 01:21 PM

IPL 2025: టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ భారత క్రికెట్ బోర్డుపై సీరియస్ అయ్యాడు. బోర్డు తీసుకొచ్చిన కొత్త రూల్‌పై అతడు అసహనం వ్యక్తం చేశాడు. ఇంతకీ కింగ్ ఏమన్నాడంటే..

Virat Kohli

భారత క్రికెట్ బోర్డుపై సీరియస్ అయ్యాడు టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ. తలతిక్క రూల్స్‌తో ఏం సాధించారంటూ ఫైర్ అయ్యాడు. టూర్ల సమయంలో ఆటగాళ్లతో వాళ్ల కుటుంబాలు ట్రావెల్ చేయకుండా కొత్త నిబంధనలు తీసుకురావడంపై కింగ్ గరంగరం అయ్యాడు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ తర్వాత రూల్స్ మార్చడంపై విరాట్ ఘాటుగా స్పందించాడు. 45 రోజుల టూర్ ఉంటే అందులో 14 రోజులు మాత్రమే ప్లేయర్ల ఫ్యామిలీస్‌ను అనుమతిస్తూ బీసీసీఐ తీసుకున్న నిర్ణయం సరైనది కాదన్నాడు డాషింగ్ బ్యాటర్. తలా తోక లేని నిర్ణయాల వల్ల ఎవరికి ఉపయోగమని ఎదురు ప్రశ్నించాడు విరాట్.


అర్థం చేసుకోవాలె

ఐపీఎల్-2025కు ముందు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ట్రెయినింగ్ క్యాంప్‌లో జాయిన్ అయ్యాడు కోహ్లీ. ఆ తర్వాత బెంగళూరులో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న స్టార్ బ్యాటర్.. భారత క్రికెట్‌ను ఉద్దేశించి పలు ఆసక్తికర విశేషాలు పంచుకున్నాడు. ఈ సందర్భంగానే ఫ్యామిలీ ప్రెజెన్స్ రూల్‌ మీదా స్పందించాడు. కుటుంబ సభ్యులతో సమయం గడపడం ఆటగాళ్లకు చాలా ముఖ్యమని.. దీన్ని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నాడు కోహ్లీ. దీని వల్ల ప్లేయర్ల మానసిక స్థితిపై ఎంత సానుకూల ప్రభావం పడుతుందో చాలా మందికి తెలియదన్నాడు.


ఎవరికి లాభం..

ఫ్యామిలీతో సమయం గడపకుండా ఆపుతున్న ఈ రూల్ వల్ల ఎవరికి లాభమని ఇన్‌డైరెక్ట్‌గా క్వశ్చన్ చేశాడు విరాట్. ఇది తనను తీవ్ర అసంతృప్తికి గురిచేసిందన్నాడు. సరిగ్గా ఆడనప్పుడు, నిరాశలో కూరుకుపోయినప్పుడు ఎవరూ ఏకాంతంగా కూర్చొని బాధపడుతూ ఉండాలని అనుకోరన్నాడు. కఠిన సమయాల్లో కుటుంబంతో గడిపితే దాని నుంచి త్వరగా కోలుకొని తిరిగి పునరుత్తేజం పొందొచ్చన్నాడు స్టార్ బ్యాటర్. ఒక్కసారి నార్మల్ అయ్యాక తిరిగి ఆట మీద ఫోకస్ పెట్టొచ్చన్నాడు. కుటుంబంతో గడిపే చిన్న అవకాశం, సందర్భాన్ని కూడా తాను ఎట్టి పరిస్థితుల్లో చేజార్చుకోనని.. తనకు ఫ్యామిలీ చాలా ముఖ్యమంటూ ముగించాడు కోహ్లీ.


ఇవీ చదవండి:

ఆ దేశానికి వెళ్లను: కోహ్లీ

మనసు మార్చుకున్న రోహిత్

నితీశ్‌కు లైన్‌క్లియర్‌

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Mar 16 , 2025 | 01:28 PM