ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Virat Kohli IPL 2025: అందుకే కెప్టెన్సీ వదిలేశా.. కోహ్లీ సంచలన వ్యాఖ్యలు

ABN, Publish Date - May 06 , 2025 | 11:26 AM

Royal Challengers Bangalore: టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఐపీఎల్‌లో అదరగొడుతున్నాడు. బ్యాట్‌తో దుమ్మురేపుతూనే కొత్త కెప్టెన్ రజత్ పాటిదార్‌కు టీమ్‌ను నడిపించడంలోనూ సాయం అందిస్తున్నాడు. అలాంటోడు తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశాడు.

Virat Kohli

టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీ ప్రస్తావన వస్తే ముందుగా బ్యాటింగే గుర్తుకొస్తుంది. టన్నుల కొద్దీ పరుగులు, లెక్కలు మించి సెంచరీలు, రికార్డుల మీద రికార్డులతో తోపు బ్యాటర్‌గా ఎదురులేని పాపులారిటీ సాధించాడు విరాట్. అయితే అతడి కెప్టెన్సీకి కూడా హ్యూజ్ ఫ్యాన్‌బేస్ ఉంది. దూకుడుకు పర్ఫెక్ట్ ప్లానింగ్, ఎగ్జిక్యూషన్‌ను కలగలిపి కోహ్లీ టీమ్‌ను ముందుండి నడిపించే తీరు అద్భుతమనే చెప్పాలి. అయితే అటు భారత జట్టుతో పాటు ఇటు ఐపీఎల్‌లో ఆర్సీబీ కెప్టెన్సీకి కూడా అతడు దూరంగా ఉంటున్నాడు. తాజాగా దీనిపై అతడు సంచలన వ్యాఖ్యలు చేశాడు. బెంగళూరు జట్టు సారథ్య బాధ్యతల నుంచి తాను తప్పుకోవడానికి గల కారణాలను అతడు పంచుకున్నాడు. అవేంటో ఇప్పుడు చూద్దాం..


తట్టుకోలేకే..

ఐపీఎల్-2016 నుంచి ఐపీఎల్-2019 వరకు మూడు సీజన్ల పాటు తనపై తీవ్రంగా ఒత్తిడి ఉండేదన్నాడు కోహ్లీ. ఆ మూడేళ్లు ఆర్సీబీకి బ్యాటర్‌గా, కెప్టెన్‌గా వ్యవహరించానని.. అయితే ప్రతి మ్యాచ్‌లోనూ తప్పక రాణించాలనే ప్రెజర్ తనపై ఉండేదన్నాడు కింగ్. ఎవ్రీ గేమ్‌లో బ్యాటర్‌గా సక్సెస్ అవడంతో పాటు సారథిగానూ తనపై అంచనాలు పెరిగిపోయాయని చెప్పాడు. అటు టీమిండియాతో పాటు ఇటు బెంగళూరు టీమ్ విషయంలోనూ ఎక్స్‌పెక్టేషన్స్, ప్రెజర్ ఎక్కువవడంతో కెప్టెన్సీకి దూరంగా ఉంటున్నానని అతడు రివీల్ చేశాడు.


24 గంటలు అదే ఆలోచన..

బ్యాటింగ్‌తో పాటు కెప్టెన్సీలోనూ సక్సెస్ అవ్వాలనే అంచనాలతో తాను తీవ్రంగా సతమతం అయ్యానని కోహ్లీ వాపోయాడు. 24 గంటలు ఇదే ఆలోచనతో ఉండేవాడ్ని అని.. దీన్ని సరిగ్గా డీల్ చేయలేకపోయానని వ్యాఖ్యానించాడు. అందుకే ఆర్సీబీ కెప్టెన్సీకి గుడ్‌బై చెప్పేశానని క్లారిటీ ఇచ్చాడు. బ్యాటర్‌గా రాణించడం, హ్యాపీగా ఉండటం, నెక్స్ట్ ఏం జరుగుతుందోననే టెన్షన్స్ లేకుండా ఉండటం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపాడు కింగ్. గేమ్‌లో ఎక్కువ రోజులు కొనసాగడానికి ఈ డెసిషన్ తీసుకోక తప్పలేదని పేర్కొన్నాడు. విజయాలు, ట్రోఫీల కంటే ప్రజల ఆదరాభిమానాలే తనకు ముఖ్యమని కోహ్లీ స్పష్టం చేశాడు.


ఇవీ చదవండి:

సిరాజ్‌ను కూల్ చేసిన రోహిత్

7 జట్లు.. 4 బెర్త్‌లు.. ఎవరెన్ని నెగ్గాలంటే..

సన్‌రైజర్స్ ఔట్.. తాను తీసిన గోతిలో తానే..

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 06 , 2025 | 11:30 AM