Share News

IPL 2025 Playoffs Cut-Off: ప్లేఆఫ్స్ కటాఫ్‌ క్లారిటీ.. రేసులో 7 జట్లు.. ఎవరెన్ని నెగ్గాలంటే..

ABN , Publish Date - May 06 , 2025 | 09:50 AM

Indian Premier League: క్యాష్ రిచ్ లీగ్-2025 ఆఖరి దశకు చేరుకుంటోంది. గ్రూప్ దశ నుంచి మెళ్లిగా ప్లేఆఫ్స్ వైపు సీజన్ అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో ప్లేఆఫ్స్‌ క్వాలిఫికేషన్‌లో ఏయే జట్లు ముందంజలో ఉన్నాయి.. ఎవరు అర్హత సాధించే అవకాశం ఉందో ఇప్పుడు చూద్దాం..

IPL 2025 Playoffs Cut-Off: ప్లేఆఫ్స్ కటాఫ్‌ క్లారిటీ.. రేసులో 7 జట్లు.. ఎవరెన్ని నెగ్గాలంటే..
IPL 2025 Playoffs

ఇండియన్ ప్రీమియర్ లీగ్-2025 టర్న్ తీసుకునేందుకు రెడీ అవుతోంది. ఇన్నాళ్లూ హోరాహోరీ గ్రూప్ పోరాటలతో అలరించిన నయా సీజన్ కాస్తా ఉత్కంఠను తారస్థాయికి తీసుకెళ్లే ప్లేఆఫ్స్ దిశగా మలుపు తీసుకోబోతోంది. ఇప్పటికే గుజరాత్ టైటాన్స్ మినహా అన్ని టీమ్స్ 11 మ్యాచులు ఆడేశాయి. సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు ఇంటిదారి పట్టాయి. 4 ప్లేఆఫ్స్ బెర్త్‌ల కోసం మిగిలిన 7 జట్లు పోటీపడుతున్నాయి. ఈ నేపథ్యంలో నెక్స్ట్ స్టేజ్‌కు వెళ్లాలంటే ఏ టీమ్ ఎన్ని మ్యాచుల్లో నెగ్గాల్సి ఉంటుందో ఇప్పుడు చూద్దాం..

rcb.jpg


గెలవక తప్పదు..

ఈ సీజన్‌లో దాదాపుగా ప్రతి జట్టు 11 మ్యాచులు ఆడినా ఇంకా ఒక్క టీమ్ కూడా అఫీషియల్‌గా ప్లేఆఫ్స్ బెర్త్ కన్ఫర్మ్ చేసుకోలేదు. 16 పాయింట్లతో టాప్‌లో ఉంది ఆర్సీబీ. ఈ జట్టు తదుపరి ఆడే 3 మ్యాచుల్లో ఒకదాంట్లో నెగ్గితే చాలు ప్లేఆఫ్స్ బెర్త్ కన్ఫర్మ్ అయిపోతుంది. పాయింట్స్ టేబుల్‌లో సెకండ్ ప్లేస్‌లో ఉన్న పంజాబ్ కింగ్స్ కూడా ఒకదాంట్లో గెలిస్తే క్వాలిఫై అవుతుంది. మూడో స్థానంలో ఉన్న ముంబై ఇండియన్స్.. 3 మ్యాచుల్లో రెండింట విజయఢంకా మోగించాల్సి ఉంటుంది. గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ కూడా నెక్స్ట్ ఆడే 3 మ్యాచుల్లో రెండింట తప్పక గెలవాలి. పాయింట్స్ టేబుల్‌లో ఆరో పొజిషన్‌లో ఉన్న కోల్‌కతా నైట్ రైడర్స్, ఏడో స్థానంలో ఉన్న లక్నో సూపర్ జెయింట్స్ తదుపరి ఆడే 3 మ్యాచుల్లోనూ నెగ్గాల్సిందే. పంత్ సేన అన్ని మ్యాచుల్లో విక్టరీ కొట్టినా ప్లేఆఫ్స్ చేరుతుందనే గ్యారెంటీ లేదు. క్వాలిఫికేషన్ కోసం ఇతర జట్ల గెలుపోటములు, నెట్ రన్‌రేట్ మీద ఎల్‌ఎస్‌జీ ఆధారపడాల్సి ఉంటుంది. ఈ వారం ముగిసేలోపు ప్లేఆఫ్స్ బెర్త్‌లపై కంప్లీట్ క్లారిటీ వచ్చేస్తుంది.


ఇవీ చదవండి:

సన్‌రైజర్స్ ఔట్.. తాను తీసిన గోతిలో తానే..

ఇండియన్‌ ఐడల్‌ నుంచి ఐపీఎల్‌కు..

మన ఆధిపత్యానికి తిరుగులేదు

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 06 , 2025 | 09:58 AM