Share News

ఇండియన్‌ ఐడల్‌ నుంచి ఐపీఎల్‌కు..

ABN , Publish Date - May 06 , 2025 | 04:00 AM

ఆటగాడిగా.. పాటగాడిగా.. ఇప్పుడు అంపైర్‌గా పరాశర్‌ జోషి (30) బహుముఖ ప్రజ్ఞ అద్భుతం. గతేడాది మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌)లో అందరి దృష్టినీ ఆకర్షించాడు...

ఇండియన్‌ ఐడల్‌ నుంచి ఐపీఎల్‌కు..

అంపైర్‌ పరాశర్‌ ఆసక్తికర ప్రయాణం

న్యూఢిల్లీ: ఆటగాడిగా.. పాటగాడిగా.. ఇప్పుడు అంపైర్‌గా పరాశర్‌ జోషి (30) బహుముఖ ప్రజ్ఞ అద్భుతం. గతేడాది మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌)లో అందరి దృష్టినీ ఆకర్షించాడు పరాశర్‌ (30). కారణం టీమిండియా క్రికెటర్‌ శ్రేయాస్‌ అయ్యర్‌ను పోలి ఉండడమే. అయితే, ఈ ఏడాది జోషి ఏకంగా ఐపీఎల్‌లోకి అడుగుపెట్టాడు. గతనెల 5న చెన్నై-ఢిల్లీ మ్యాచ్‌కు అంపైరింగ్‌ చేశాడు. చిన్నతనంలో క్లబ్‌ స్థాయిలో జోషి మ్యాచ్‌లు ఆడాడు. 2008లో ప్రఖ్యాత రియాల్టీ షో ఇండియన్‌ ఐడల్‌లో పోటీపడ్డాడు. ఈ క్రమంలో పియానో రౌండ్‌కు ఎంపికయ్యాడు. తర్వాత గాయకుడిగా ఎదగడం కష్టంగా మారడంతో మళ్లీ క్రికెట్‌వైపు అడుగులు వేశాడు. అయితే, ఈసారి అంపైర్‌గా. 2015లో బీసీసీఐ అంపైరింగ్‌ ప్యానెల్‌లో చోటు సంపాదించిన జోషి.. రంజీలు, దులీప్‌ ట్రోఫీ లాంటి దేశవాళీ టోర్నీలకు అంపైరింగ్‌ చేశాడు. దీంతో గతేడాది డబ్ల్యూపీఎల్‌లో చాన్స్‌ లభించింది. అక్కడ తన పనితీరుకు మంచి మార్కులు రావడంతో.. ఈ సీజన్‌ ఐపీఎల్‌లో చోటు దక్కించుకున్నాడు..

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - May 06 , 2025 | 04:00 AM