Share News

మన ఆధిపత్యానికి తిరుగులేదు

ABN , Publish Date - May 06 , 2025 | 04:08 AM

తెల్ల బంతుల ఫార్మాట్‌లో తనకు తిరుగులేదని భారత్‌ నిరూపించుకుంది. అయితే టెస్ట్‌ల్లో మాత్రం ఒకింత వెనుకంజలో నిలిచింది. ఈమేరకు ఐసీసీ సోమవారం...

మన ఆధిపత్యానికి తిరుగులేదు

వన్డేలు, టీ20లలో టాప్‌ ర్యాంక్‌

  • టెస్ట్‌ల్లో నాలుగో స్థానం

  • ఐసీసీ వార్షిక ర్యాంకింగ్స్‌

దుబాయ్‌: తెల్ల బంతుల ఫార్మాట్‌లో తనకు తిరుగులేదని భారత్‌ నిరూపించుకుంది. అయితే టెస్ట్‌ల్లో మాత్రం ఒకింత వెనుకంజలో నిలిచింది. ఈమేరకు ఐసీసీ సోమవారం ప్రకటించిన వార్షిక ర్యాంకింగ్స్‌లో..టీమిండి యా వన్డేలు, టీ20ల్లో అగ్రస్థానాన్ని కాపాడుకుంది. సుదీర్ఘ ఫార్మాట్‌లో మాత్రం నాలుగో ర్యాంక్‌ దక్కించుకుంది. పురుషుల తాజా ర్యాంకింగ్స్‌లో..2024 మే నుంచి ఆడిన అన్ని మ్యాచ్‌లనుంచి 100 శాతం పాయింట్లను పరిగణనలోకి తీసుకున్నారు. అంతకుముందు రెండు సంవత్సరాలలో ఆడిన మ్యాచ్‌లనుంచి 50 శాతం పాయింట్లనే తీసుకున్నారు.


వన్డేలు: భారత్‌ 50 ఓవర్ల ఫార్మాట్‌లో తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకుంది. దాంతో జట్టు రేటింగ్‌ పా యింట్లు 122 నుంచి 124కు పెరిగాయి. న్యూజిలాండ్‌, ఆస్ర్టేలియా రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. శ్రీలంక, పాకిస్థాన్‌, దక్షిణాఫ్రికా తర్వాతి ర్యాంకులు సాధించాయి. ఇంగ్లండ్‌ను వెనక్కు నెట్టిన అఫ్ఘానిస్థాన్‌ ఏడో స్థానంలో నిలవడం విశేషం.

టీ20లు: ఈ విభాగంలో ప్రస్తుత వరల్డ్‌ చాంపియన్‌ టీమిండియా (271 పాయింట్లు) నెం.1గా నిలిచింది. ఆస్ట్రేలియా (262), ఇంగ్లండ్‌ (254) వరుసగా రెండు మూడు స్థానాలు దక్కించుకున్నాయి. న్యూజిలాండ్‌, వెస్టిండీస్‌, దక్షిణాఫ్రికా, శ్రీలంక, పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌, అప్ఘానిస్థాన్‌లకు వరుసగా ఆ తదుపరి ర్యాంక్‌లు లభించాయి.


టెస్ట్‌లు: ప్రస్తుత ప్రపంచ టెస్ట్‌ చాంపియన్‌ ఆస్ట్రేలియా (126 పాయింట్లు) సుదీర్ఘ ఫార్మాట్‌లో అగ్ర స్థానాన్ని పదిలం చేసుకుంది. ఇంగ్లండ్‌ (113), దక్షిణాఫ్రికా (111), భారత్‌ (105) వరుసగా వరుసగా రెండు, మూడు, నాలుగు ర్యాంక్‌లలో నిలిచాయి. న్యూజిలాండ్‌, శ్రీలంక, పాకిస్థాన్‌, వెస్టిండీస్‌, బంగ్లాదేశ్‌, జింబాబ్వే వరుసగా ఆ తదుపరి ర్యాంకులు కైవసం చేసుకున్నాయి.

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - May 06 , 2025 | 04:09 AM