ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Virat Kohli Success Secret: ఆ ఇద్దరి వల్లే ఈ స్థాయిలో ఉన్నా.. కోహ్లీ ఎమోషనల్

ABN, Publish Date - May 06 , 2025 | 01:20 PM

Indian Premier League: టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తన కెరీర్ మీద ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వాళ్లిద్దరి వల్లే ఈ స్థాయిలో ఉన్నానని అన్నాడు. మరి.. అతడికి ఆసాంతం అండగా నిలబడిన ఆ ఇద్దరు ఎవరనేది ఇప్పుడు చూద్దాం..

Virat Kohli

17 ఏళ్ల కింద టీమిండియాలోకి వచ్చాడో కుర్ర బ్యాటర్. ఎన్నో అనుమానాలు, ఒత్తిళ్ల మధ్య ఎంట్రీ ఇచ్చిన ఆ ప్లేయర్.. మ్యాచ్ మ్యాచ్‌కు ఇంప్రూవ్ అవుతూ మెళ్లిగా భారత జట్టులో సెటిల్ అయ్యాడు. కాలం గిర్రున తిరిగింది. ఇప్పుడు భారత క్రికెట్‌కే కాదు.. వరల్డ్ క్రికెట్‌కే అతడు పెద్ద అంబాసిడర్. ఆ ప్లేయర్ మరెవరో కాదు.. టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ. అసాధ్యం అనుకున్న ప్రతిదీ సాధిస్తూ పోతున్న కింగ్.. తాజాగా తన కెరీర్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ఆ ఇద్దరి సహకారం వల్లే తాను ఈ స్థాయిలో ఉన్నానని అన్నాడు. మరి.. విరాట్‌కు సపోర్ట్‌గా ఉంటూ వచ్చిన వాళ్లు ఎవరనేది ఇప్పుడు చూద్దాం..


ప్లేస్ గ్యారెంటీ..

లెజెండ్ ఎంఎస్ ధోని, టీమిండియా మాజీ కోచ్ గ్యారీ కిర్‌స్టెన్ కెరీర్ ఆరంభంలో తనకు చాలా సహకారం అందించారని కోహ్లీ తెలిపాడు. ప్రస్తుతం ఐపీఎల్‌లో ఆర్సీబీకి ఆడుతూ బిజీగా ఉన్న ఈ సూపర్‌స్టార్.. తాజా ఇంటర్వ్యూలో కెరీర్ తొలినాళ్లను తలచుకున్నాడు. 3వ నంబర్‌లో బ్యాటింగ్‌కు దిగాలని.. సక్సెస్-ఫెయిల్యూర్‌తో సంబంధం లేకుండా టీమ్‌లో చోటు గ్యారెంటీ అని తనకు భరోసా ఇచ్చారని గుర్తుచేశాడు విరాట్. గ్రౌండ్‌లో ఎనర్జిటిక్‌గా ఉంటూ, టీమ్‌ కోసం ఏం చేయగలనని భావిస్తున్నావో అది చేయాలంటూ ఎంతగానో ప్రోత్సహించారని పేర్కొన్నాడు. పట్టు వదలకుండా పోరాడటం, ఆఖరి వరకు ఓటమిని ఒప్పుకోకపోవడం లాంటి తనలోని కొన్ని క్వాలిటీస్ నచ్చి ధోని-కిర్‌స్టెన్ మద్దతుగా నిలబడ్డారని కోహ్లీ వివరించాడు. కాగా, కోహ్లీ ప్రాతినిధ్యం వహిస్తున్న ఆర్సీబీ.. క్యాష్ రిచ్ లీగ్ తాజా సీజన్‌లో దుమ్మురేపుతోంది. ఇప్పటికి ఆడిన 11 మ్యాచుల్లో 8 విజయాలతో 16 పాయింట్లతో టాప్‌లో కొనసాగుతోంది బెంగళూరు. నెక్స్ట్ ఆడే 3 మ్యాచుల్లో ఒక్కదాంట్లో నెగ్గినా ఆ జట్టు అధికారికంగా ప్లేఆఫ్స్‌కు క్వాలిఫై అవుతుంది.


ఇవీ చదవండి:

చరణ్‌ను కాపీ కొట్టిన డీసీ బ్యాటర్

అందుకే కెప్టెన్సీ వదిలేశా: కోహ్లీ

సిరాజ్‌ను కూల్ చేసిన రోహిత్

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 06 , 2025 | 01:36 PM