DC vs SRH: చరణ్‌ను కాపీ కొట్టిన డీసీ బ్యాటర్.. మక్కీకి మక్కీ దింపేశాడుగా..
ABN , Publish Date - May 06 , 2025 | 12:33 PM
IPL 2025: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ను ఓ ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్ కాపీ కొట్టాడు. అచ్చం చెర్రీలాగే బ్యాట్ హ్యాండిల్‌ను గట్టిగా నేలకు కొట్టి ఒకేసారి జంప్ చేసి షాట్ బాదాడు. మరి.. ఎవరా బ్యాటర్ అనేది ఇప్పుడు చూద్దాం..

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ను మక్కీకి మక్కీ దించేశాడో క్రికెటర్. చెర్రీ నెక్స్ట్ మూవీ పెద్దిలో మాదిరిగా బ్యాట్ హ్యాండిల్‌ను నేల మీదకు గట్టిగా కొట్టి.. బంతి మీదకు దూకి భారీ షాట్ బాదాడు. ఆ బ్యాటర్ మరెవరో కాదు.. ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ ఫినిషర్ అశుతోష్ శర్మ. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌కు ముందు డీసీ ట్రెయినింగ్ సెషన్‌లో అశుతోష్ ఓ ఇంట్రెస్టింగ్ సీన్ రీక్రియేట్ చేశాడు. పెద్ది సినిమా టీజర్‌లోని చరణ్ బ్యాటింగ్ సీన్‌ను మక్కీకి మక్కీ దింపేశాడు. పిచ్ మీద ఉన్న మట్టిని భుజానికి రాసుకొని అచ్చం చరణ్‌లాగే బ్యాటింగ్ చేశాడు డీసీ స్టార్.
అచ్చం చెర్రీలాగే..
బ్యాట్ హ్యాండిల్‌ను గట్టిగా నేలకు ఆనించిన తర్వాత ఒక్కసారిగా పైకి లేచాడు అశుతోష్. ఆ తర్వాత బంతి మీదకు స్టెపౌట్ అయ్యాడు. దాన్ని బలంగా బాదాడు. ఈ సిగ్నేచర్ షాట్ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. పెద్ది మూవీలోని సీన్‌ను అశుతోష్ భలేగా కాపీ చేశాడని.. అచ్చం చెర్రీలాగే షాట్ బాదాడని మెచ్చుకుంటున్నారు నెటిజన్స్. కాగా, అశుతోష్‌తో పాటు మరో ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్ సమీర్ రిజ్వీ కూడా పెద్దిలో చరణ్ బ్యాటింగ్ స్టైల్‌ను రిపీట్ చేశాడు. వీటిని చూసిన నెటిజన్స్.. పెద్ది పాన్ ఇండియా లెవల్‌లో ఆడియెన్స్‌కు రీచ్ అయిందని, దానికి ఇదే బిగ్ ఎగ్జాంపుల్ అని అంటున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే.. ఇక రిలీజ్ టైమ్‌కు మూవీ మీద బజ్ ఏ రేంజ్‌లో ఉంటుందో ఊహించలేమని చెబుతున్నారు. కాగా, 11 మ్యాచుల్లో 6 విజయాలతో 13 పాయింట్లతో ఉన్న డీసీ.. నెక్స్ట్ ఆడే 3 మ్యాచుల్లో రెండింట్లో నెగ్గితేనే ప్లేఆఫ్స్‌కు క్వాలిఫై అవుతుంది.
ఇవీ చదవండి:
అందుకే కెప్టెన్సీ వదిలేశా: కోహ్లీ
7 జట్లు.. 4 బెర్త్‌లు.. ఎవరెన్ని నెగ్గాలంటే..
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి