ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Virat Kohli: కోహ్లీ దెబ్బకు దిగొచ్చిన బీసీసీఐ.. వివాదాస్పద రూల్ వెనక్కి..

ABN, Publish Date - Mar 19 , 2025 | 09:16 AM

BCCI: భారత క్రికెట్ బోర్డు దిగొచ్చిందని తెలుస్తోంది. విరాట్ కోహ్లీ దెబ్బకు వేరే ఆప్షన్ లేకపోవడంతో బోర్డు యూ-టర్న్ తీసుకుందని సమాచారం. అసలు భారత క్రికెట్‌లో ఏం జరుగుతోంది.. అనేది ఇప్పుడు చూద్దాం..

Virat Kohli

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఏ విషయం మీదైనా అంత ఈజీగా రియాక్ట్ అవ్వడు. ఒకవేళ స్పందించాలని భావిస్తే మాత్రం తన అభిప్రాయాన్ని నిక్కచ్ఛిగా కుండబద్దలు కొట్టినట్లు చెప్పేస్తాడు. ఇటీవల ఓ కాంట్రవర్సీ రూల్‌పై అతడు ఇలాగే తనదైన శైలిలో రియాక్ట్ అయ్యాడు. తలతిక్క రూల్స్ అవసరమా అంటూ భారత క్రికెట్ బోర్డును ఇన్‌డైరెక్ట్‌గా క్వశ్చన్ చేశాడు. అతడు స్పందించింది దేని గురించో కాదు.. ఫ్యామిలీ పాలసీ రూల్‌ మీదే. భారత జట్టు టూర్లలో ఆటగాళ్ల కుటుంబ సభ్యులను అనుమతించడంపై బీసీసీఐ తీసుకొచ్చిన కొత్త నిబంధనలపై విరాట్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. అతడి దెబ్బకు బోర్డు దిగొచ్చిందని తెలుస్తోంది.


బీసీసీఐ యూ-టర్న్

విదేశీ పర్యటనల్లో ప్లేయర్ల కుటుంబ సభ్యులు (భార్య, పిల్లలు) వాళ్లతో ఎన్నాళ్లు ఉండొచ్చనే దానిపై ఆంక్షలు విధించింది బీసీసీఐ. 45 రోజులకు మించిన పర్యటనల్లో 14 రోజులు మాత్రమే ఫ్యామిలీని అనుమతిస్తారు. అది కూడా టూర్ స్టార్ట్ అయిన రెండు వారాల తర్వాతే. 45 కంటే తక్కువ రోజుల పర్యటనల్లో ఒక వారం మాత్రమే కుటుంబ సభ్యుల్ని అనుమతిస్తారు. ఈ రూల్ కారణంగా ఇటీవల జరిగిన చాంపియన్స్ ట్రోఫీ-2025 సమయంలో కోహ్లీ-రోహిత్ ఫ్యామిలీస్‌తో పాటు ఇతర ఆటగాళ్ల కుటుంబ సభ్యులు కూడా హోటల్స్‌లో సొంత ఖర్చులు భరిస్తూ ఉండాల్సి వచ్చింది. దీంతో ఈ రూల్‌ మీద సీరియస్ అయ్యాడు కోహ్లీ.


వాళ్ల అనుమతి తప్పనిసరి

‘విదేశీ పర్యటనల్లో మ్యాచులు ముగిసిన తర్వాత గదిలో ఒంటరిగా కూర్చొని విచారిస్తుంటాం. దీని కంటే ఫ్యామిలీతో కాస్త సమయం గడిపితే మేం తిరిగి నార్మల్ అయిపోతాం కదా.. ఇది గేమ్‌ను ఓ రెస్పాన్సిబిలిటీగా చూసేందుకు సాయపడుతుంది. ఒత్తిడి నుంచి బయటపడేందుకు, మెంటల్‌గా స్ట్రాంగ్ అయ్యేందుకు ఉపయోగపడుతుంది’ అని కోహ్లీ చెప్పుకొచ్చాడు. కాగా, ఈ వ్యాఖ్యలపై బీసీసీఐ పెద్దలు సమాలోచనలు చేశారట. ఫ్యామిలీ పాలసీ మీద పునరాలోచనలు చేశారట. ఆటగాళ్లను కుటుంబ సభ్యులతో ఎక్కువ కాలం ఉండేందుకు అవకాశం ఇవ్వాలని భావిస్తున్నారట. అయితే దీనికి కోచ్ గంభీర్, కెప్టెన్‌తో పాటు జీఎం ఆపరేషన్స్ పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుందట. ఈ రూల్ గురించి బోర్డు పెద్దలు మరింత లోతుగా ఆలోచిస్తున్నారని సమాచారం.


ఇవీ చదవండి:

కళ్లన్నీ ఛెత్రిపైనే

ఎండ వేడిమికి తాళలేక పిచ్‌పైనే..

మద్యం, పొగాకు ప్రకటనలపై నిషేధం

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Mar 19 , 2025 | 09:23 AM