మద్యం, పొగాకు ప్రకటనలపై నిషేధం!
ABN , Publish Date - Mar 19 , 2025 | 05:13 AM
ఐపీఎల్‌లో ఇకనుంచి మద్యం, పొగాకు, క్రిప్టో కరెన్సీ సంబంధిత ప్రకటనలు కనిపించే ఆస్కారం ఉండకపోవచ్చు. ఈమేరకు బీసీసీఐ త్వరలోనే నిర్ణయం తీసుకోనుంది...
బీసీసీఐ సుముఖం
న్యూఢిల్లీ: ఐపీఎల్‌లో ఇకనుంచి మద్యం, పొగాకు, క్రిప్టో కరెన్సీ సంబంధిత ప్రకటనలు కనిపించే ఆస్కారం ఉండకపోవచ్చు. ఈమేరకు బీసీసీఐ త్వరలోనే నిర్ణయం తీసుకోనుంది. ఐపీఎల్‌లో మద్యం, పొగాకు ఉత్పత్తుల ప్రకటనలను నిషేధించాలని ఇటీవల కేంద్ర ఆరోగ్య శాఖ సూచించిన విషయం తెలిసిందే. దీన్ని దృష్టిలో ఉంచుకుని బీసీసీఐ ఈనెల 22న కోల్‌కతాలో జరిగే బోర్డు అపెక్స్ కౌన్సిల్‌లో మార్గదర్శకాలు విడుదల చేయనుంది. అలాగే భారత్‌లోనే జరిగే 2025 మహిళల వన్డే వరల్డ్‌కప్ నిర్వహణపై నిర్వాహక కమిటీని కూడా ఏర్పాటు చేయనున్నారు. అలాగే ఈ మెగా టోర్నీ వేదికలపై కూడా చర్చ జరుగనుంది.
ఇవీ చదవండి:
యుద్ధభూమిని వీడొద్దు: హార్దిక్
ఒక్క వీడియోతో దడ పుట్టిస్తున్న పంత్
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి