ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Varun Chakaravarthy: వరుణ్ చక్రవర్తికి బీసీసీఐ షాక్.. తప్పు చేయాలంటే భయపడేలా..

ABN, Publish Date - May 08 , 2025 | 02:52 PM

BCCI: కేకేఆర్ స్టార్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తికి భారత క్రికెట్ బోర్డు గట్టి షాక్ ఇచ్చింది. మళ్లీ తప్పు చేయాలంటే భయపడేలా చేసింది. అసలు వరుణ్ చేసిన తప్పేంటో ఇప్పుడు చూద్దాం..

Varun Chakaravarthy

కోల్‌కతా నైట్ రైడర్స్‌కు దెబ్బ మీద దెబ్బ పడుతోంది. ప్లేఆఫ్స్ చేరాలంటే తప్పక నెగ్గాల్సిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ చేతుల్లో 2 వికెట్ల తేడాతో క్లోజ్ ఫైట్‌లో ఓడిపోయింది కేకేఆర్. దీంతో ప్లేఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ఇకపై ఆడాల్సిన 2 మ్యాచుల్లోనూ నెగ్గినా ప్లేఆఫ్స్ చేరాలంటే ఇతర జట్ల గెలుపోటముల మీద ఆధారపడక తప్పదు. ఇలాంటి సిచ్యువేషన్‌లో రహానె సేనకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ టీమ్ ప్రధాన స్పిన్నర్ వరుణ్ చక్రవర్తికి బిగ్ షాక్ ఇచ్చింది భారత క్రికెట్ బోర్డు. అతడికి 25 శాతం ఫైన్ వేసింది. అసలు వరుణ్ చేసిన తప్పేంటి.. అనేది ఇప్పుడు చూద్దాం..


తప్పేంటి..

లెవల్ 1 నేరం కింద ఆర్టికల్ 2.5 కోడ్ ఆఫ్ కండక్ట్‌ను ఉల్లంఘించాడనే కారణంతో వరుణ్ చక్రవర్తిపై 25 శాతం జరిమానా విధించింది బీసీసీఐ. అలాగే అతడికి ఒక డీమెరిట్ పాయింట్ కూడా వేసింది. చెన్నైతో మ్యాచ్‌లో డెవాల్డ్ బ్రేవిస్‌‌ను ఔట్ చేశాడు వరుణ్. 25 బంతుల్లో 52 పరుగుల విధ్వంసక ఇన్నింగ్స్ ఆడిన బ్రేవిస్ జోరును చూసి కేకేఆర్ భయపడసాగింది. ఈ తరుణంలో అతడ్ని ఔట్ చేసిన వరుణ్.. క్రీజును వదిలేసి వెళ్లిపొమ్మంటూ చేతితో సంజ్ఞ చేశాడు. దీంతో ఫైన్ విధించారు. అయితే మ్యాచ్ రిఫరీ ఎదుట వరుణ్ తన నేరాన్ని ఒప్పుకున్నాడని ఐపీఎల్ ఓ ప్రకటనలో తెలిపింది. కాగా, బ్యాటర్ ఔట్ అయినప్పుడు అతడి వైపు ఏ ప్లేయర్ అయినా ఉపయోగించే భాష లేదా సంజ్ఞలకు సంబంధించినదే ఆర్టికల్ 2.5. జెంటిల్మన్ గేమ్‌లో ఇలాంటి వాటికి చోటు లేదని.. అసభ్యకర, ఓవర్ అగ్రెసివ్ సెలబ్రేషన్స్‌కు అడ్డుకట్ట వేయాల్సిందేనని కొందరు నెటిజన్స్ అంటున్నారు. బీసీసీఐ నిర్ణయం భేష్ అని.. తప్పు చేయాలంటే భయపడేలా ఫైన్ వేయడం, డీమెరిట్ పాయింట్‌తో మందలించడం కరెక్ట్ అని కామెంట్స్ చేస్తున్నారు.


ఇవీ చదవండి:

ఓడినా ఇంకా ప్లేఆఫ్స్ చాన్స్

కోహ్లీ వైఫ్‌తో స్టార్ సింగర్..

పాక్‌కు ఇచ్చిపడేసిన సానియా

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 08 , 2025 | 02:57 PM