Share News

Virat Kohli-Rahul Vaidya: కోహ్లీ వైఫ్‌తో స్టార్ సింగర్.. ఇక నీ పని ఫినిష్

ABN , Publish Date - May 08 , 2025 | 12:57 PM

Anushka Sharma: టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ చుట్టూ ఓ కాంట్రవర్సీ నడుస్తోంది. ఇందులో విరాట్‌తో పాటు అతడి సతీమణి అనుష్క శర్మ కూడా ఉండటం గమనార్హం. అసలేంటీ కాంట్రవర్సీ అనేది ఇప్పుడు చూద్దాం..

Virat Kohli-Rahul Vaidya: కోహ్లీ వైఫ్‌తో స్టార్ సింగర్.. ఇక నీ పని ఫినిష్
Virat Kohli

టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ప్రస్తుతం ఐపీఎల్‌లో ఆడుతూ బిజీగా ఉన్నాడు. ఆర్సీబీకి ఫస్ట్ ట్రోఫీ అందించాలనే కసితో ఉన్న కింగ్.. క్యాష్ రిచ్ లీగ్‌ తాజా సీజన్‌లో పట్టుదలతో ఆడుతున్నాడు. ఈ తరుణంలో ఊహించని వివాదంలో కింగ్ పేరు వినిపిస్తోంది. విరాట్‌తో పాటు అతడి సతీమణి అనుష్క శర్మ పేరు కూడా ఈ కాంట్రవర్సీలో నానుతోంది. వీళ్లిద్దరితో పాటు స్టార్ సింగర్ రాహుల్ వైద్య కూడా ఈ వివాదంలో కీలకంగా ఉన్నాడు. అసలు ఏంటీ కాంట్రవర్సీ.. రాహుల్‌తో కోహ్లీ-అనుష్కకు ఉన్న లింక్ ఏంటి.. ఈ వివాదంలో తప్పెవరిది.. అనేది ఇప్పుడు చూద్దాం..


ఎందుకు లైక్ కొట్టినట్లు..

అవనీత్ కౌర్ అనే నటి ఫ్యాన్ పేజ్‌ పోస్ట్‌కు ఇటీవల లైక్ కొట్టాడు కోహ్లీ. అయితే కొద్దిసేపటికే లైక్‌ను తొలగించాడు. ఇది సరిగ్గా అనుష్క శర్మ బర్త్‌డే నాడు జరిగింది. దీంతో నెట్టింట దీనిపై డిస్కషన్స్ ఊపందుకున్నాయి. కోహ్లీ లైక్ కొట్టి మళ్లీ ఎందుకు తీసేసినట్లు అనే చర్చలు జరిగాయి. కొందరు దీన్ని సాంకేతిక లోపంగా భావించగా.. ఇంకొందరు అనుష్కను అనవసరంగా ఇందులోకి లాగారు. ఆమెను ట్యాగ్ చేస్తూ రూమర్స్ పుట్టించారు. దీనిపై ఇన్‌స్టాలో కోహ్లీ క్లారిటీ ఇచ్చాడు. ఇది అల్గారిథమ్ లోపం వల్ల జరిగిందన్నాడు. అయితే దీనిపై సింగర్ రాహుల్ వైద్య సెటైరికల్‌గా రియాక్ట్ అయ్యాడు. దీంతో వివాదం మరింత రాజుకుంది.


కావాలనే బయటకు తీశాడా..

అప్పట్లో ఓ ఈవెంట్‌లో పాట పాడుతూ అనుష్క శర్మ చేతికి ముద్దు పెట్టాడు రాహుల్ వైద్య. ఇది జరిగిన కొన్నాళ్లకు రాహుల్‌ను ఇన్‌స్టాలో బ్లాక్ చేశాడు కోహ్లీ. అది మనసులో పెట్టుకున్న రాహుల్ వైద్య.. తాజా కాంట్రవర్సీలో దూరాడు. ఇన్‌స్టాగ్రామ్ అల్గారిథమ్ కోహ్లీని బ్లాక్ చేసిందేమోనంటూ విరాట్ ఫ్యాన్స్‌ను తీవ్రంగా రెచ్చగొట్టేలా కామెంట్ చేశాడు. ఇదే సమయంలో అప్పట్లో అనుష్క చేతికి రాహుల్ కిస్ ఇచ్చిన వీడియో నెట్టింట వైరల్ కాసాగింది. దీంతో అతడిపై కోహ్లీ ఫ్యాన్స్ ఆవేశంతో ఊగిపోతున్నారు. రాహుల్ వైద్యను నెట్టింట ఏకిపారేస్తున్నారు. కోహ్లీ పైనే సెటైర్ వేస్తావా.. అంటూ సీరియస్ అవుతున్నారు. అనుష్క వీడియో కావాలనే బయటకు తెచ్చావంటూ గరంగరం అవుతున్నారు. ఈ కాంట్రవర్సీకి ఎప్పుడు ఫుల్‌స్టాప్ పడుతుందో చూడాలి.


ఇవీ చదవండి:

పాక్‌కు ఇచ్చిపడేసిన సానియా

ఎంతపని చేశావ్ రోహిత్..

ప్లేఆఫ్స్‌కు ముందు ఆర్సీబీకి బిగ్ షాక్

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 08 , 2025 | 01:00 PM