Rajat Patidar: ఆర్సీబీ మోసం చేసింది.. రజత్ పాటిదార్ సంచలన వ్యాఖ్యలు
ABN, Publish Date - May 17 , 2025 | 08:47 AM
Indian Premier League: ఐపీఎల్-2025లోని మిగిలిన మ్యాచులు ఇవాళ్టితో మొదలవుతాయి. తొలి మ్యాచ్‌లో కోల్‌కతాను ఢీకొట్టనుంది ఆర్సీబీ. ఈ తరుణంలో ఆ జట్టు సారథి రజత్ పాటిదార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బెంగళూరు ఫ్రాంచైజీ తనకు మోసం చేసిందన్నాడు. రజత్ వ్యాఖ్యల వెనుక ఆంతర్యం ఏంటో ఇప్పుడు చూద్దాం..
భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల వల్ల అర్ధాంతరంగా ఆగిపోయిన ఐపీఎల్-2025 తిరిగి శనివారంతో మొదలవుతోంది. క్యాష్ రిచ్ లీగ్‌లోని మిగిలిన మ్యాచుల్ని త్వరితగతిన పూర్తి చేయాలని భారత క్రికెట్ బోర్డు భావిస్తోంది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు-కోల్‌కతా నైట్ రైడర్స్ నడుమ ఇవాళ జరిగే మ్యాచ్‌తో సీజన్ రీస్టార్ట్ కానుంది. ఈ నేపథ్యంలో ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బెంగళూరు ఫ్రాంచైజీ తనకు మోసం చేసిందంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు. తాను ఎంతగా నమ్మినా దాన్ని టీమ్ నిలబెట్టుకోలేదన్నాడు. దీంతో అసలు జట్టు సారథి అయి ఉండి మోసం చేశారు అంటూ కీలక వ్యాఖ్యలు చేయడం వెనుక ఆంతర్యం ఏంటి.. అసలు పాటిదార్ ఎందుకిలా అన్నాడు.. అనేది ఇప్పుడు చూద్దాం..
మళ్లీ రావొద్దనుకున్నా..
ఐపీఎల్ మెగా ఆక్షన్-2022లో తనను సెలెక్ట్ చేయనందుకు ఆర్సీబీపై కోపం వచ్చిందని రివీల్ చేశాడు పాటిదార్. బెంగళూరు తనను తప్పకుండా తీసుకుంటుందని అనుకున్నానని.. కానీ ఎంపిక చేయకపోవడంతో చాలా బాధగా అనిపించిందన్నాడు. ఆఖరుకు ఓ ఆటగాడికి గాయమవడంతో అతడికి బదులు తనను రీప్లేస్ చేశారని గుర్తుచేసుకున్నాడు రజత్. 2021లో ఆర్సీబీకి ఆడానని.. తనను అట్టిపెట్టుకుంటామని టీమ్ నుంచి ఓ మెసేజ్ వచ్చిందన్నాడు. అయితే తీరా ఆక్షన్‌లో రీటెయిన్ చేయకపోవడంతో కోపంతో దేశవాళీ క్రికెట్ బాట పట్టానని చెప్పుకొచ్చాడు. అయితే సిసోడియా అనే ప్లేయర్ గాయపడటంతో అతడి స్థానంలో బెంగళూరు ఫ్రాంచైజీ నుంచి తనకు కాల్ వచ్చిందన్నాడు పాటిదార్. జట్టులోకి తీసుంటామని చెప్పి మోసం చేయడంతో బాధగా అనిపించిందన్నాడు. ఆ దెబ్బకు మళ్లీ ఆర్సీబీకి రావొద్దని అనుకున్నానని పేర్కొన్నాడు.
కోహ్లీ మాటలతో..
ఒక ఆటగాడు గాయపడ్డాడు కాబ్టటి తనకు అవకాశం దక్కిందని.. దీంతో తుదిజట్టులోకి తీసుకోరేమోనని అనిపించిందన్నాడు పాటిదార్. డగౌట్‌లో కూర్చోవాల్సి వస్తుందేమోనని ఆందోళన చెందానన్నాడు. కెప్టెన్‌గా ప్రకటించినప్పుడు కూడా టెన్షన్ పడ్డానని.. అయితే కోహ్లీ మాటలతో ధైర్యం వచ్చిందన్నాడు రజత్. సారథ్య బాధ్యతలు తీసుకున్న సమయంలో విరాట్ నుంచి ఓ జ్ఞాపికను అందుకున్నానని.. దీనికి నువ్వు అర్హుడివి అంటూ అతడు తనలో స్ఫూర్తిని నింపాడని వివరించాడు. కాగా, ఈ ఐపీఎల్ సీజన్‌లో 11 మ్యాచుల్లో 239 పరుగులు చేసిన రజత్ పాటిదార్.. సారథిగానూ అదరగొడుతున్నాడు. వరుస మ్యాచుల్లో ఆర్సీబీని గెలిపిస్తూ ప్లేఆఫ్స్ రేసులో జట్టును పరుగులు పెట్టిస్తున్నాడు.
ఇవీ చదవండి:
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - May 17 , 2025 | 08:51 AM