PBKS vs RCB: రాసిపెట్టుకోండి కప్పు ఆర్సీబీదే.. ఈ సెంటిమెంటే ప్రూఫ్!
ABN, Publish Date - May 29 , 2025 | 03:16 PM
ఐపీఎల్-2025లో ఇవాళ కీలక పోరు జరగనుంది. ఒక ఫైనలిస్ట్ ఎవరో నేడు తేలిపోనుంది. పంజాబ్ కింగ్స్-రాయల్ చాలెంజర్స్ బెంగళూరు నడుమ క్వాలిఫయర్-1 మ్యాచ్ జరగనుంది. అయితే పంజాబ్ కంటే బెంగళూరుకు చాలా విషయాలు సానుకూలంగా కనిపిస్తున్నాయి. ఓ సెంటిమెంట్ కోహ్లీ టీమ్‌కు బలాన్ని ఇస్తోంది. అదేంటో ఇప్పుడు చూద్దాం..
ఐపీఎల్-2025 తుదిదశకు చేరుకుంది. ఇవాళ్టి నుంచి ప్లేఆఫ్స్ ఫైట్స్ షురూ కానున్నాయి. క్వాలిఫయర్-1లో భాగంగా నేటి పోరులో పంజాబ్ కింగ్స్-రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తలపడనున్నాయి. ఇందులో గెలిచిన జట్టు ఫైనల్స్‌కు వెళ్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో నెగ్గి తీరాలని రెండు టీమ్స్ పట్టుదలతో ఉన్నాయి. ఓడినా ఫైనల్స్ వెళ్లేందుకు మరో అవకాశం ఉంటుంది. ఎలిమినేటర్‌లో గెలిచిన జట్టుతో క్వాలిఫయర్-2లో తలపడాలి. అయితే అంతవరకు తెచ్చుకోవద్దంటే క్వాలిఫయర్-1లో విజయం సాధిస్తే సరిపోతుంది. దీంతో పంజాబ్-ఆర్సీబీ తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నాయి. ఇరు జట్లకు కొన్ని సానుకూల అంశాలు ఉన్నాయి. బలాబలాల పరంగా బెంగళూరుకు ఎక్కువ ప్లస్సులు ఉన్నాయి. దీంతో పాటు ఓ సెంటిమెంట్ కూడా ఆ టీమ్‌దే విజయమని ధీమా ఇస్తోంది. మరి.. ఏంటా సెంటిమెంట్ అనేది ఇప్పుడు చూద్దాం..
కప్పు ఖాయం!
ఐపీఎల్‌లో ఇప్పటివరకు 17 సీజన్లు జరిగాయి. ఇప్పుడు 18వ సీజన్ నడుస్తోంది. క్యాష్ రిచ్ లీగ్ హిస్టరీలో పాయింట్స్ టేబుల్‌లో రెండో స్థానంలో ఉన్న జట్టు ఎక్కువసార్లు విజేతగా నిలిచింది. ముఖ్యంగా 2011 నుంచి 2024 వరకు చూసుకుంటే.. పాయింట్స్ టేబుల్‌లో సెకండ్ పొజిషన్‌లో ఉన్న టీమ్ ఏకంగా 8 సార్లు కప్పు ఎగరేసుకుపోయింది. అదే టేటుబ్ టాపర్‌గా ఉన్న జట్లు 5 సార్లు ట్రోఫీని సొంతం చేసుకున్నాయి. పాయింట్స్ టేబుల్‌లో మూడో స్థానంలో నిలిచిన జట్టు ఒకసారి చాంపియన్‌గా నిలిచింది. ఈ లెక్కన చూసుకుంటే నంబర్ 2లో ఉన్న టీమ్ విన్నర్‌గా నిలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ సెంటిమెంట్ గనుక రిపీట్ అయితే ఆర్సీబీకి కప్పు ఖాయమనే చెప్పాలి.
ఈ సాలా కప్ నమ్దే..
ఐపీఎల్-2025 లీగ్ దశ ముగిసేసరికి పాయింట్స్ టేబుల్‌లో పంజాబ్ కింగ్స్ (19 పాయింట్లు) ఫస్ట్ ప్లేస్‌లో ఉండగా.. రెండో స్థానంలో నిలిచింది బెంగళూరు (19 పాయింట్లు). ఇరు జట్లు సమాన పాయింట్లతో ఉన్నా నెట్ రన్‌రేట్ మెరుగ్గా ఉండటంతో అయ్యర్ సేన టేబుల్ టాపర్‌గా ఫినిష్ చేసింది. ఈ రెండు జట్ల నడుమ ఇవాళ టగ్ ఆఫ్ వార్ జరగనుంది. దీంతో ఈ సెంటిమెంట్ రిపీట్ అవుతుందని.. ఇందులో నెగ్గి ఆర్సీబీ ఫైనల్ చేరడమే గాక, కప్పు కూడా కొడుతుందని ఆ జట్టు అభిమానులు నమ్మకంగా చెబుతున్నారు. ఈ సాలా కప్ నమ్దే (ఈసారి కప్ మాదే) అని స్లోగన్స్ ఇస్తున్నారు.
ఇవీ చదవండి:
పొల్లుపొల్లు కొట్టుకున్న బంగ్లా-ప్రొటీస్ క్రికెటర్లు
ఇదేం సెలెక్షన్.. మంజ్రేకర్ సీరియస్
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - May 29 , 2025 | 03:16 PM