Share News

Sanjay Manjrakar: ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్.. టీమిండియా సభ్యుల ఎంపికపై సంజయ్ మంజ్రేకర్ విమర్శలు

ABN , Publish Date - May 29 , 2025 | 10:29 AM

ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్ కోసం సర్ఫరాజ్ ఖాన్‌ను ఎంపిక చేయకపోవడంపై మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ అభ్యంతరం వ్యక్తం చేశారు.

Sanjay Manjrakar: ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్.. టీమిండియా సభ్యుల ఎంపికపై సంజయ్ మంజ్రేకర్ విమర్శలు
India squad selection

ఇంటర్నెట్ డెస్క్: ఇంగ్లండ్‌తో త్వరలో జరగనున్న ఐదు మ్యాచుల టెస్టు సిరీస్‌ కోసం టీమిండియా జట్టుకు పులువురు కొత్త సభ్యులు ఎంపికయ్యారు. దేశవాళీ క్రికెట్‌లో సత్తా చాటిన అనేక మందికి చోటు దక్కింది. కునాల్ నాయర్, శార్దూల్ ఠాకూర్ వంటి వారు ఇంగ్లండ్ టూర్‌కు ఎంపికయ్యారు. అయితే, ఈ సిరీస్‌కు సర్ఫరాజ్ ఖాన్‌ను ఎంపిక చేయకపోవడంపై విమర్శలు ఎక్కువవుతున్నాయి. మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ ఎక్స్ వేదికగా తన అసంతృప్తిని వెళ్ళగక్కారు.

గౌతమ్ గంభీర్ జట్టు మార్గదర్శకత్వంలో టీమ్ మేనేజ్‌మెంట్.. జట్టు సభ్యుల ఎంపిక విషయంలో వారి ప్రస్తుత ఫార్మ్‌ను పరిగణనలోకి తీసుకుంటున్నట్టు లేదని సంజయ్ మంజ్రేకర్ అభిప్రాయపడ్డారు. పిచ్ పరిస్థితులు, ప్రత్యర్థి బలాబలాల ఆధారంగా ఎవరు ఎలా ఆడొచ్చనే అంచనాతో మాత్రమే నిర్ణయాలు తీసుకుంటున్నట్టు ఉందని విమర్శించారు. నాలుగు టెస్టుల్లో మూడు అర్థ సెంచరీలు 150 పరుగులు చేసిన సర్ఫరాజ్‌ ఆ తరువాత నాలుగు ఇన్నింగ్స్‌లో ఆడనందుకే =ఆస్ట్రేలియా టూర్‌లో ఒక్క అవకాశం కూడా దొరక్కపోవడం విచారకరమని అన్నాడు. ఇటీవల కాలంలో కరన్ నాయర్‌కు మించి అద్భుత ప్రదర్శన చేసినా కూడా ఇంగ్లండ్ జట్టుకు ఎంపిక కాలేదని కామెంట్ చేశాడు.


ఇక ఇంగ్లండ్ టెస్టు సిరీస్‌ కోసం ఆసక్తి ప్రదర్శించిన సర్ఫరాజ్ పక్కా ఆహార నియమాలు ఫాలో అయ్యి పది కేజీల బరువు కూడా తగ్గాడు. ఇప్పటివరకూ అతడు విదేశాల్లో భారత్ తరపున ఒక్క టెస్టు మ్యాచ్ ఆడింది కూడా లేదు. ఇంగ్లండ్ లయన్స్‌తో జరగనున్న రెండు టెస్టు మ్యాచుల్లో తలపడేందుకు అతడు ఇండియా స్క్వాడ్ ఏ తరపున ఎంపికయ్యాడు. మే 30- జూన్ 2 మధ్య కాంటర్‌బరీ, జూన్ 6-9 మధ్యలో నార్తాంప్టన్‌లో ఈ సిరీస్ జరగనంది.


ఇక 2016 చెన్నై వేదికగా ఇంగ్లండ్‌పై జరిగిన మ్యాచ్‌లో నాయర్ ట్రిపుల్ సెంచరీ చేశారు. 2024/25 సీజన్‌లో రంజీ ట్రోఫీలో 53.93 సగటుతో 863 పరుగులు చేశాడు. ఆ సీజన్ అత్యధిక పరుగులు రాబట్టిన నాలుగో వ్యక్తిగా నిలిచాడు.

ఇవి కూడా చదవండి:

సూర్యవంశీపై శుభమన్ గిల్ కాంట్రవర్షియల్ కామెంట్స్.. వెల్లువెత్తుతున్న విమర్శలు

వైభవ్ సూర్యవంశీ ముందున్న అతిపెద్ద సవాలు అదే: స్టీవ్ వా

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి

Updated Date - May 29 , 2025 | 10:37 AM