ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

KL Rahul: ఐపీఎల్ కోసం రాహుల్ త్యాగం.. టీమిండియాలోకి నో ఎంట్రీ

ABN, Publish Date - Mar 19 , 2025 | 11:29 AM

Delhi Capitals: ఐపీఎల్ కోసం కేఎల్ రాహుల్ భారీ త్యాగం చేస్తున్నాడని తెలుస్తోంది. దీని వల్ల అతడి కెరీర్‌కు పెద్దగా ఒరిగేదేమీ లేదని.. పైగా టీమిండియాలోకి అతడి ఎంట్రీ కష్టమనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. దీని గురించి మరింతగా తెలుసుకుందాం..

KL Rahul

టీమిండియా స్టైలిష్ బ్యాటర్ కేఎల్ రాహుల్‌ ఒక్కో ఫార్మాట్‌ను బట్టి ఒక్కోలా ఆడుతుంటాడు. ఫార్మాట్‌కు తగ్గట్లు తన బ్యాటింగ్ శైలిని మార్చుకుంటాడు. అంతేకాదు బ్యాటింగ్ పొజిషన్ కూడా చేంజ్ చేస్తుంటాడు. టీమ్ మేనేజ్‌మెంట్ ఎక్కడ ఆడమంటే ఆ స్థానంలో ఆడతాడు. ఏ బాధ్యత అప్పజెప్పినా నెరవేరుస్తాడు. ఇది చాంపియన్స్ ట్రోఫీలోనూ ప్రూవ్ అయింది. ఇప్పటికే వన్డేలు, టెస్టుల్లో జట్టులో తన స్థానాన్ని పదిలం చేసుకున్న రాహుల్.. పొట్టి ఫార్మాట్‌లోనూ టీమ్‌లో పర్మినెంట్ మెంబర్‌గా మారాలని అనుకుంటున్నాడు. కానీ అది సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. అనవసర త్యాగంతో తన కెరీర్‌ను సందిగ్ధంలో పడేశాడు కేఎల్. దీని గురించి మరింతగా తెలుసుకుందాం..


అదే శాపం..

ఐపీఎల్-2025కు సిద్ధమవుతున్న కేఎల్ రాహుల్.. ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున మిడిలార్డర్‌లో ఆడనున్నాడని తెలుస్తోంది. సాధారణంగా టీ20ల్లో ఓపెనింగ్ స్లాట్‌లో బ్యాటింగ్ చేస్తుంటాడతను. పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జియాంట్స్ టీమ్స్‌కు ఆడినప్పుడు అతడే ఇన్నింగ్స్ స్టార్ట్ చేసేవాడు. కానీ ఢిల్లీ మాత్రం అతడి సేవల్ని మిడిలార్డర్‌లో ఉపయోగించుకోవాలని అనుకుంటోందట. జేక్ ఫ్రేజర్ మెక్‌గర్క్, ఫాఫ్ డుప్లెసిస్, అభిషేక్ పోరెల్ టాపార్డర్‌లో ఉండటంతో మిడిలార్డర్ బాధ్యతల్ని తీసుకోవాలని కేఎల్ భావిస్తున్నాడట. అయితే ఇదే అతడికి శాపంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.


ఒకే బెర్త్..

టీ20 వరల్డ్ కప్-2026లో ఆడాలని అనుకుంటున్న రాహుల్.. తిరిగి భారత టీ20 టీమ్‌లోకి కమ్‌బ్యాక్ ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే జట్టులో ఏ స్లాట్ కూడా ఖాళీగా లేదు. అందరూ అదరగొడుతున్నారు. సంజూ శాంసన్ కూడా సౌతాఫ్రికా సిరీస్‌లో వరుస సెంచరీలతో తన స్థానం పదిలం చేసుకున్నాడు. అయితే ఇంగ్లండ్‌ సిరీస్‌లో దారుణంగా విఫలమయ్యాడు. ఒకవేళ అతడు మళ్లీ గాడి తప్పితే వికెట్ కీపర్-ఓపెనింగ్ బ్యాటర్‌ రోల్ కోసం లైక్ టు లైక్ రీప్లేస్‌మెంట్ కింద రాహుల్‌ను టీమ్‌లోకి తీసుకోవచ్చు. కానీ ఐపీఎల్‌లో అతడు మళ్లీ మిడిలార్డర్‌లో ఆడితే టీమిండియా బెర్త్ మిస్ అవుతుందని ఎక్స్‌పర్ట్స్ హెచ్చరిస్తున్నారు. డీసీ గెలుపు కోసం రాహుల్ చేస్తున్న త్యాగం వల్ల అతడికి ఒరిగేదేమీ లేదని.. నష్టమే తప్ప లాభం లేదని నెటిజన్స్ అంటున్నారు.


ఇవీ చదవండి:

ఐపీఎల్ కీలక మ్యాచ్ రీషెడ్యూల్.. కారణం ఇదే..

కోహ్లీ దెబ్బకు దిగొచ్చిన బీసీసీఐ

ఎండ వేడిమికి తాళలేక పిచ్‌పైనే..

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Mar 19 , 2025 | 11:39 AM