IPL 2025: ఐపీఎల్ కీలక మ్యాచ్ రీషెడ్యూల్.. కారణం ఏంటంటే..
ABN , Publish Date - Mar 19 , 2025 | 11:02 AM
BCCI: క్యాష్ రిచ్ లీగ్ కొత్త సీజన్‌కు టైమ్ మరింత దగ్గర పడుతోంది. ఇంకో మూడ్రోజుల్లో ఐపీఎల్ కొత్త ఎడిషన్ స్టార్ట్ కానుంది. దీంతో దుమ్మురేపేందుకు ఆటగాళ్లు సిద్ధమవుతున్నారు.
ఐపీఎల్ కొత్త సీజన్ మార్చి 22వ తేదీ నుంచి స్టార్ట్ కానుంది. నయా ఎడిషన్‌కు ఇంకా మూడ్రోజుల సమయమే ఉండటంతో అన్ని జట్లు సాధనలో జోరు పెంచాయి. ప్రాక్టీస్‌తో పాటు ప్లానింగ్ మీదా దృష్టి పెట్టాయి. కప్పు గెలవడానికి కావాల్సిన అన్ని రకాల వ్యూహాలు, సన్నద్ధతపై ఫోకస్ పెడుతున్నాయి. అటు అభిమానులు ఫేవరెట్ స్టార్స్ గేమ్ చూసేందుకు తహతహలాడుతున్నారు. ఈ తరుణంలో ఓ కీలక మ్యాచ్ గురించి ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ బయటకు వచ్చింది. అదేంటో ఇప్పుడు చూద్దాం..
భారీగా ఊరేగింపులు
క్యాష్ రిచ్ లీగ్ నయా సీజన్ షెడ్యూల్‌ను నిర్వాహకులు ఇప్పటికే ప్రకటించారు. అయితే ఇందులోని ఓ మ్యాచ్ జరగడం మాత్రం అనుమానంగా మారింది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్-లక్నో సూపర్ జియాంట్స్ జట్ల మధ్య ఏప్రిల్ 6న జరగాల్సిన మ్యాచ్ రీషెడ్యూల్ చేయనున్నట్లు తెలుస్తోంది. అదే రోజు శ్రీ రామ నవమి ఉండటంతో ఈ మ్యాచ్ నిర్వహణ మీద సందిగ్ధం నెలకొంది. సేఫ్టీ రీజన్స్ రీత్యా మ్యాచ్‌ను వేరే తేదీకి రీషెడ్యూల్ చేసే చాన్స్ ఉందని వినిపిస్తోంది. బెంగాల్ వ్యాప్తంగా ఆ రోజు పెద్ద సంఖ్యలో ఊరేగింపులు జరిగే అవకాశం ఉందని బీజేపీ నాయకుడు సువేందు అధికారి వెల్లడించారు.
సేమ్ టు సేమ్
శ్రీ రామ నవమి నేపథ్యంలో ఒకవైపు ఊరేగింపులకు, మరోవైపు మ్యాచ్‌కు సెక్యూరిటీ కల్పించడం కష్టమే. ఇది పోలీసులకు బిగ్ చాలెంజ్ అనే చెప్పాలి. అందుకే ఈ విషయం మీద సిటీ పోలీస్‌తో క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ (క్యాబ్) ప్రెసిడెంట్ స్నేహ్‌శీశ్ గంగూలీ రెండుసార్లు డిస్కస్ చేశారట. అయితే పోలీసుల నుంచి క్యాబ్‌కు స్పష్టమైన హామీ ఇంకా రాలేదని సమాచారం. విభాగాల వారీగా ప్రాధాన్యత అంశాలు ఉండటంతో ఫుల్ సెక్యూరిటీ కేటాయించలేమని పోలీసులు చెబుతున్నారని స్నేహ్‌శీశ్ పేర్కొన్నారు. కాగా, ఏప్రిల్ 6న జరగాల్సిన మ్యాచ్ నిర్వహణ విషయంలో బీసీసీఐదే ఫైనల్ డెసిషన్ అని లక్నో ఓనర్ సంజీవ్ గోయెంకా తెలిపారు. లాస్ట్ ఐపీఎల్‌లో కేకేఆర్-రాజస్థాన్ మ్యాచ్‌కూ ఇదే సిచ్యువేషన్ ఎదురైంది. అప్పుడు కూడా శ్రీ రామ నవమి ఉండటంతో ఆ మ్యాచ్‌ను రీషెడ్యూల్ చేసింది ఇండియన్ ప్రీమియర్ లీగ్ కమిటీ.
ఇవీ చదవండి:
ఐపీఎల్ ఆరంభానికి ముందే ఐదుగురు స్టార్లు ఔట్
కోహ్లీ దెబ్బకు దిగొచ్చిన బీసీసీఐ
ఎండ వేడిమికి తాళలేక పిచ్‌పైనే..
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి