ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

IND vs ENG: చేతుల్లోకి మ్యాచ్.. అయినా వదలని భయం.. కారణం ఇదే..!

ABN, Publish Date - Jul 04 , 2025 | 11:10 AM

ఎడ్జ్‌బాస్టన్ టెస్ట్‌లో టీమిండియా రెచ్చిపోయి ఆడుతోంది. మొదట బ్యాటింగ్‌లో అదరగొట్టిన గిల్ అండ్ కో.. ఆ తర్వాత బౌలింగ్‌లోనూ తడాఖా చూపిస్తున్నారు. అయితే ఓ భయం మాత్రం జట్టును వదలడం లేదు.

India vs England

లీడ్స్ టెస్ట్‌లో అనూహ్యంగా ఓటమిపాలైన టీమిండియా.. ఎడ్జ్‌బాస్టన్‌లో మాత్రం అదరగొడుతోంది. తొలి మ్యాచ్ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని కసితో ఉన్న గిల్ సేన.. ఆతిథ్య జట్టును వణికిస్తోంది. మొదట బ్యాటింగ్‌‌లో రెచ్చిపోయిన మెన్ ఇన్ బ్లూ ఏకంగా 587 పరుగుల భారీ స్కోరు చేసింది. ఆ తర్వాత బౌలింగ్‌లో 25 పరుగులకే ముగ్గురు ఇంగ్లండ్ బ్యాటర్లను వెనక్కి పంపించి మంచి దూకుడు కనబర్చింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి స్టోక్స్ సేన 77 పరుగులతో ఉంది. క్రీజులో జో రూట్ (18 నాటౌట్), హ్యారీ బ్రూక్ (30 నాటౌట్) ఉన్నారు. అయితే రెండ్రోజుల పాటు ఆటలో ఆధిపత్యం కనబర్చినా టీమిండియా క్యాంపులో భయం పోవడం లేదు. దీనికి కారణం ఏంటో ఇప్పుడు చూద్దాం..

గేర్లు మారిస్తే..

రెండో టెస్టులో బ్యాటింగ్‌లో అదరగొట్టిన భారత్.. బౌలింగ్‌లోనూ రెచ్చిపోతోంది. ఇప్పటికే క్రాలే, డకెట్, పోప్ లాంటి ప్రమాదకర బ్యాటర్లను మన బౌలర్లు వెనక్కి పంపించారు. అయినా క్రీజులో ఉన్న రూట్-బ్రూక్‌ భారత క్యాంపును భయపెడుతున్నారు. ముఖ్యంగా బజ్‌బాల్ గేమ్‌కు బాగా అలవాటు పడిన బ్రూక్ ఎక్కడ తమ మీద విరుచుకుపడతాడోనని టెన్షప్ పడుతున్నారు. రూట్ క్రీజులో పాతుకుపోవడం, స్ట్రైక్ రొటేషన్‌లో ఎక్స్‌పర్ట్. అతడు ఒక ఎండ్ నుంచి స్కోరు బోర్డును కదిలిస్తూ పోతే.. మరోవైపు నుంచి బ్రూక్ అటాక్ చేస్తే భారత్‌కు తీవ్ర ఇబ్బందులు తప్పవు. వీళ్లకు తోడు కెప్టెన్ స్టోక్స్ ఇంకా బ్యాటింగ్‌కు రావాల్సి ఉంది.

ఇద్దర్నీ ఔట్ చేస్తేనే..

జేమీ స్మిత్, ఆల్‌రౌండర్ క్రిస్ వోక్స్ కూడా బ్యాట్ ఝళిపించగల సమర్థులే. అటు టాపార్డర్‌ను కూల్చిన భారత బౌలర్లు.. మిడిలార్డర్ పని పట్టగలరా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మిడిలార్డర్, లోయరార్డర్‌‌ను ఔట్ చేయడంలో టీమిండియాకు చెత్త రికార్డు ఉంది. పైగా పేసుగుర్రం జస్‌ప్రీత్ బుమ్రా ఆడట్లేదు. కాబట్టి బజ్‌బాజ్ ఫార్ములాతో ఇంగ్లండ్ వేగం పెంచి ఆడితే, వాళ్ల మిడిలార్డర్ బ్యాటర్లు క్రీజులో పాతుకుపోతే టీమిండియాకు కష్టమే అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రూట్-బ్రూక్‌ను ఔట్ చేస్తే ఇంగ్లండ్ బ్యాక్ సీట్‌లోకి వెళ్తుందని, స్టోక్స్ కూడా డిఫెన్స్‌లో పడిపోతాడని.. అప్పుడు ఆలౌట్ ఈజీ అవుతుందని ఎక్స్‌పర్ట్స్ అంటున్నారు. ఏమాత్రం లైట్ తీసుకున్నా, బౌలింగ్‌లో నిలకడ, క్రమశిక్షణ తప్పినా చేతుల్లో ఉందనుకున్న మ్యాచ్ కాస్తా లీడ్స్‌లాగే సమర్పయామి అయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

ఇవీ చదవండి:

స్టోక్స్ గాలి తీసేసిన జడేజా

సక్సెస్ సీక్రెట్ బయటపెట్టిన గిల్

కార్ల్‌సన్‌కు గుకేష్‌ షాక్‌

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 04 , 2025 | 12:07 PM