Home » India vs England Test Series
భారత్-ఇంగ్లండ్ మధ్య జరిగిన టెస్ట్ సిరీస్‌లో ఇద్దరు ఆటగాళ్లు అందరి హృదయాలను గెలుచుకున్నారు. గాయాలతోనే బ్యాటింగ్‌కు దిగి తమ జట్టుకు అండగా నిలవడానికి ప్రయత్నించిన టీమిండియా ఆటగాడు రిషభ్ పంత్, ఇంగ్లండ్ బౌలర్ క్రిస్ వోక్స్‌ను చాలా మంది క్రీడాభిమానులు ప్రశంసించారు.
టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తాజా ఇంగ్లండ్ సిరీస్‌లో పది ఇన్నింగ్స్‌ల్లో 754 పరుగులు చేశాడు. మరో 21 పరుగులు చేసి ఉంటే సునీల్ గవాస్కర్ (771) రికార్డును బద్దలుగొట్టేవాడు. ఆ రికార్డును గిల్ త్రుటిలో మిస్ అయ్యాడు.
ఓవల్ మైదానం వేదికగా జరుగుతున్న చివరి టెస్ట్ మ్యాచ్ ఆసక్తికరంగా సాగుతోంది (Ind vs Eng). టీ బ్రేక్ వరకు ఇంగ్లండ్ ఆధిపత్యం కొనసాగింది. అయితే సెంచరీ హీరోలు హ్యారీ బ్రూక్ (111), జో రూట్ (105) అవుటైన తర్వాత టీమిండియా మళ్లీ గేమ్‌లోకి వచ్చింది.
ప్రస్తుతం ఓవల్ మైదానంలో జరుగుతున్న ఐదో టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ విజయం దిశగా సాగుతోంది (Ind vs Eng). బ్యాటింగ్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై హ్యారీ బ్రూక్ (94 నాటౌట్), జో రూట్ (78 నాటౌట్) క్రీజులో పాతుకుపోయి వేగంగా పరుగులు చేస్తున్నారు.
ఇంగ్లండ్ ఎదుట టీమిండియా 374 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. చివరి రోజు ఆరంభంలో రెండు వికెట్లు పడగొట్టి సంతోషంలో మునిగిన టీమిండియాకు హ్యారీ బ్రూక్ (50 నాటౌట్), జో రూట్ (30 నాటౌట్) షాకిచ్చారు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు అజేయంగా 80 పరుగులు జోడించారు.
ఓవల్ మైదానంలో ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదో టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా ఓపెనర్ యశస్వి జైస్వాల్ (142 బంతుల్లో 109 నాటౌట్) అద్భుత సెంచరీతో చెలరేగాడు. ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా జరుగుతున్న చివరి టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా రెండో ఇన్నింగ్స్ ఆడుతోంది.
ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా జరుగుతున్న చివరి టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా రెండో ఇన్నింగ్స్ ఆడుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 224 పరుగులు మాత్రమే చేసిన టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం భారీ స్కోరు దిశగా సాగుతోంది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (73 నాటౌట్) వేగంగా పరుగులు సాధిస్తున్నాడు.
తాజా సిరీస్‌లో ఒక్కసారి కూడా టాస్ గెలవని సాంప్రదాయాన్ని టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కొనసాగించాడు. తాజా మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ కెప్టెన్ ఓలీ పోప్ బౌలింగ్ ఎంచుకున్నాడు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది.
ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా జరగాల్సిన చివరి మ్యాచ్ గురువారం నుంచి కెన్నింగ్ టవల్ మైదానంలో ప్రారంభం కాబోతోంది. ఇప్పటికే ఇంగ్లండ్ జట్టు ఈ సిరీస్‌లో 2-1తో ఆధిక్యంలో ఉన్న సంగతి తెలిసిందే. చివరి మ్యాచ్‌లో టీమిండియా గెలిస్తేనే సిరీస్‌ను డ్రా చేసుకోగలుగుతుంది.
చివరి రోజు రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ సెంచరీలను అడ్డుకునేందుకు ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ వేసిన డ్రా ఎత్తులను కూడా టీమిండియా తిప్పికొట్టింది. ఈ నేపథ్యంలో మాజీ ఆటగాడు సునీల్ గవాస్కర్ టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌కు కొన్ని సూచనలు చేశాడు.