Share News

Chris Woakes: ఆ సమయంలో ఎవరైనా అదే చేస్తారు.. భారత ఆటగాళ్లు అభినందించారు: క్రిస్ వోక్స్

ABN , Publish Date - Aug 07 , 2025 | 02:26 PM

భారత్‌-ఇంగ్లండ్ మధ్య జరిగిన టెస్ట్ సిరీస్‌లో ఇద్దరు ఆటగాళ్లు అందరి హృదయాలను గెలుచుకున్నారు. గాయాలతోనే బ్యాటింగ్‌కు దిగి తమ జట్టుకు అండగా నిలవడానికి ప్రయత్నించిన టీమిండియా ఆటగాడు రిషభ్ పంత్, ఇంగ్లండ్ బౌలర్ క్రిస్ వోక్స్‌ను చాలా మంది క్రీడాభిమానులు ప్రశంసించారు.

Chris Woakes: ఆ సమయంలో ఎవరైనా అదే చేస్తారు.. భారత ఆటగాళ్లు అభినందించారు: క్రిస్ వోక్స్
Chris Woakes

భారత్‌-ఇంగ్లండ్ మధ్య జరిగిన టెస్ట్ సిరీస్‌లో ఇద్దరు ఆటగాళ్లు అందరి హృదయాలను గెలుచుకున్నారు (Ind vs Eng). గాయాలతోనే బ్యాటింగ్‌కు దిగి తమ జట్టుకు అండగా నిలవడానికి ప్రయత్నించిన టీమిండియా ఆటగాడు రిషభ్ పంత్ (Rishabh Pant), ఇంగ్లండ్ బౌలర్ క్రిస్ వోక్స్‌ (Chris Woakes)ను చాలా మంది క్రీడాభిమానులు ప్రశంసించారు. ఓవల్ మైదానంలో జరిగిన చివరి మ్యాచ్‌లో ఒంటి చేత్తోనే బ్యాటింగ్ వచ్చిన క్రిస్ వోక్స్ తాజాగా మాట్లాడాడు. తాను గాయంతోనే బ్యాటింగ్‌కు రావాల్సిన పరిస్థితుల గురించి స్పందించాడు.


'గాయంతో నేను బ్యాటింగ్‌కు రావాలనుకోవడం సరైన నిర్ణయమే అని భావిస్తున్నా. ఇంకా, వంద పరుగులు చేయాల్సి వచ్చిన పరిస్థితుల్లో బ్యాటింగ్‌కు వెళ్లాల్సి వచ్చినా నేను బాధపడేవాడిని కాదు. నేనే కాదు.. ఇతర దేశాలకు చెందిన ఆటగాళ్లైనా ఇలాగే చేస్తారని అనుకుంటున్నా. నొప్పితోనే బ్యాటింగ్‌కు రావడంపై గిల్ నన్ను అభినందించాడు. భారత ఆటగాళ్లందరూ నన్ను ప్రశంసించారు. నా ఫొటోకు ఇన్‌స్టాగ్రామ్‌లో రిషభ్ పంత్ సెల్యూట్ ఎమోజీ పెట్టాడు' అని వోక్స్ చెప్పాడు.


అలాగే మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌తో జరిగిన సంభాషణ గురించి కూడా వోక్స్ మాట్లాడాడు. 'చివరి టెస్ట్ మ్యాచ్ ముగిసిన తర్వాత గిల్‌తో మాట్లాడా. నీకు ఇది గొప్ప సిరీస్‌గా మిగిలిపోతుందని ప్రశంసించా. జట్టును ముందుండి నడింపించావని, బ్యాటింగ్‌లో రాణించి మంచి సోపర్ట్ ఇచ్చావని ప్రశంసించా' అని వోక్స్ చెప్పాడు. చివరి టెస్ట్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ సమయంలో క్రిస్ వోక్స్ భుజానికి గాయం అయిన సంగతి తెలిసిందే.


ఇవి కూడా చదవండి..

ధ్రువ్ జురెల్ ఉంటే గెలుపు ఖాయమా? టీమిండియాకు ధ్రువ్ ఉంటే కలిసొస్తోందా..


ఇది క్రీడా పోటీనా..భారత్-పాక్ మ్యాచ్‌పై ప్రియాంక చతుర్వేది ఆగ్రహం


మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Aug 07 , 2025 | 02:26 PM