Share News

Eng Vs India: భయపెడుతున్న ఇంగ్లండ్ బ్యాటర్లు.. విజయానికి మరో 194 పరుగుల దూరంలో ఇంగ్లీష్ జట్టు..

ABN , Publish Date - Aug 03 , 2025 | 06:36 PM

ఇంగ్లండ్ ఎదుట టీమిండియా 374 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. చివరి రోజు ఆరంభంలో రెండు వికెట్లు పడగొట్టి సంతోషంలో మునిగిన టీమిండియాకు హ్యారీ బ్రూక్ (50 నాటౌట్), జో రూట్ (30 నాటౌట్) షాకిచ్చారు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు అజేయంగా 80 పరుగులు జోడించారు.

Eng Vs India: భయపెడుతున్న ఇంగ్లండ్ బ్యాటర్లు.. విజయానికి మరో 194 పరుగుల దూరంలో ఇంగ్లీష్ జట్టు..
Harry Brook

ప్రస్తుతం ఓవల్ మైదానంలో జరుగుతున్న ఐదో టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ బ్యాటర్లు గట్టి పోటి ఇస్తున్నారు (Ind vs Eng). ఇంగ్లండ్ ఎదుట టీమిండియా 374 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. చివరి రోజు ఆరంభంలో రెండు వికెట్లు పడగొట్టి సంతోషంలో మునిగిన టీమిండియాకు హ్యారీ బ్రూక్ (50 నాటౌట్), జో రూట్ (30 నాటౌట్) షాకిచ్చారు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు అజేయంగా 80 పరుగులు జోడించారు.


టీమిండియా బౌలర్లను సునాయాసంగా ఎదుర్కొంటూ ఇంగ్లండ్ బ్యాటర్లు వేగంగా పరుగులు చేస్తున్నారు. ముఖ్యంగా హ్యారీ బ్రూక్ వన్డే తరహాలో బ్యాటింగ్ చేస్తున్నాడు. కేవలం 40 బంతుల్లోనే అర్ధశతకం సాధించాడు. అందులో 6 ఫోర్లు, 2 సిక్స్‌లు ఉన్నాయి. ఇక, మరోవైపు టెస్ట్ స్పెషలిస్ట్ జో రూట్ తన ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. రూట్ 54 బంతుల్లో 31 పరుగులతో ఆడుతున్నాడు. వీరిద్దరూ వికెట్ల పతనాన్ని అడ్డుకోవడమే కాకుండా వేగంగా పరుగులు చేస్తూ టీమిండియాకు ఆందోళన కలిగిస్తున్నారు.


ప్రస్తుతానికి ఇంగ్లండ్ 42 ఓవర్లలో 190 పరుగులు చేసింది. విజయానికి మరో 184 పరుగుల దూరంలో ఉంది. ఈ జోడీని విడదీయడానికి టీమిండియా కెప్టెన్ గిల్ బౌలర్లను మారుస్తూనే ఉన్నాడు. అయినప్పటికీ పరుగుల వేగం మాత్రం తగ్గడం లేదు. ఈ మ్యాచ్‌లో టీమిండియా గెలిస్తేనే సిరీస్‌ను డ్రా చేసుకోగలుగుతుంది. ఈ మ్యాచ్ డ్రా అయినా, టీమిండియా ఓటమి పాలైనా సిరీస్ ఇంగ్లండ్ వశమవుతుంది.


ఇవి కూడా చదవండి..

గిల్ మాస్టర్‌ప్లాన్.. చివరి ఓవర్లో క్రాలీని సిరాజ్ ఎలా బౌల్డ్ చేశాడో చూడండి..


ఇది క్రీడా పోటీనా..భారత్-పాక్ మ్యాచ్‌పై ప్రియాంక చతుర్వేది ఆగ్రహం


మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Aug 03 , 2025 | 06:36 PM