Shubman Gill: నా రికార్డు కంటే గిల్ ఇంగ్లండ్ ప్రదర్శన అత్యుత్తమం.. గిల్‌కు గవాస్కర్ బహుమతి..
ABN , Publish Date - Aug 04 , 2025 | 07:25 AM
టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తాజా ఇంగ్లండ్ సిరీస్‌లో పది ఇన్నింగ్స్‌ల్లో 754 పరుగులు చేశాడు. మరో 21 పరుగులు చేసి ఉంటే సునీల్ గవాస్కర్ (771) రికార్డును బద్దలుగొట్టేవాడు. ఆ రికార్డును గిల్ త్రుటిలో మిస్ అయ్యాడు.
టీమిండియా కెప్టెన్ అయిన తొలి సిరీస్‌లోనే శుభ్‌మన్ గిల్ (Shubman Gill) అదరగొట్టాడు. బ్యాట్‌తో అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. తాజా ఇంగ్లండ్ సిరీస్‌లో పది ఇన్నింగ్స్‌ల్లో 754 పరుగులు చేశాడు (Ind vs Eng). మరో 21 పరుగులు చేసి ఉంటే సునీల్ గవాస్కర్ (771) రికార్డును బద్దలుగొట్టేవాడు. ఆ రికార్డును గిల్ త్రుటిలో మిస్ అయ్యాడు. అయితే గిల్ ఆ రికార్డును బద్దలుకొట్టలేకపోయినప్పటికీ అప్పటి తన పెర్ఫార్మెన్స్‌తో పోల్చుకుంటే తాజా గిల్ ప్రదర్శనే అత్యుత్తమని గవాస్కర్ (Sunil Gavaskar) కొనియాడాడు.
'ఒక సిరీస్‌లో 754 పరుగులు చేయడం అంటే సాధారణ విషయం కాదు. నా రికార్డును బద్దలుకొట్టలేకపోయి ఉండొచ్చు. కానీ, కెప్టెన్‌గా తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటూ గిల్ చేసిన ఈ ప్రదర్శన నా రికార్డు కంటే అత్యుత్తమం. కెప్టెన్‌గా తొలి సిరీస్‌లో నేను ఈ స్థాయిలో ఆడలేదు. ఆ రికార్డు నెలకొల్పినపుడు నేను చిన్న పిల్లాడిని. నా మీద ఎలాంటి ఒత్తిడీ లేదు. నేను ఫెయిల్ అయినా నన్నెవరూ ప్రశ్నించలేరు. కానీ, ఇప్పుడు గిల్ పరిస్థితి వేరు. ఎలా చూసుకున్నా నా రికార్డు కంటే గిల్ తాజా ప్రదర్శన చాలా గొప్పది' అని గవాస్కర్ పేర్కొన్నాడు.
తన రికార్డును బద్దలుకొట్టలేకపోయినప్పటికీ గిల్‌ను ప్రశంసిస్తూ అతడికి గవాస్కర్ ఓ బహుమతిని అందజేశాడు. తన సంతకంతో కూడిన టోపీని, టీషర్ట్‌ను అందించాడు. తాను చాలా తక్కువ మందికి మాత్రమే తన సంతకంతో కూడా టోపీని అందిస్తానని ఈ సందర్భంగా గిల్‌తో గవాస్కర్ వ్యాఖ్యానించాడు. మైదానంలో గిల్‌ను అభినందించాడు.
ఇవి కూడా చదవండి..
గిల్ మాస్టర్‌ప్లాన్.. చివరి ఓవర్లో క్రాలీని సిరాజ్ ఎలా బౌల్డ్ చేశాడో చూడండి..
ఇది క్రీడా పోటీనా..భారత్-పాక్ మ్యాచ్‌పై ప్రియాంక చతుర్వేది ఆగ్రహం
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..