Snake Viral Video: కరెంట్ తీగలపై పాము.. చివరకు జరిగింది చూస్తే షాకవ్వాల్సిందే..
ABN, Publish Date - Aug 07 , 2025 | 04:52 PM
పొలానికి కంచెగా వేసిన విద్యుత్ లైన్లపై ఓ పాము పాకుతూ వెళ్తోంది. వరసగా ఉన్న లైన్లపై పాకుతూ వెళ్లిన పాము.. వాటి నుంచి కిందకు దూకే సమయంలో సడన్‌గా షాకింగ్ ఘటన చోటు చేసుకుంది..
పాములు ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తుంటాయి. కొన్నిసార్లు ఊహించని ప్రదేశాల్లోనూ దర్శనమిస్తుంటాయి. మంచాల కింద నుంచి కొన్నిసార్లు బయటికి వస్తే.. మరికొన్నిసార్లు సీలింగ్ ఫ్యాన్ల మీద దర్శనమిస్తుంటాయి. ఇంకొన్నిసార్లు ఏకంగా కరెంట్ తీగలపై కూడా పాకుతూ కనిపిస్తుంటాయి. అయితే ఇలాంటి సందర్భాల్లో పాములకు షాక్ కొడుతుందా.. అనే సందేహం చాలా మందికి వ్యక్తమవుతుంటుంది. చాలాసార్లు పాములు విద్యుత్ లైన్లపై వెళ్లడం చూస్తుంటాం. అయితే కొన్నిసార్లు ఇలాంటి సందర్భాల్లో షాకింగ్ ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ పాము విద్యుత్ లైన్లపై పాకుతూ వెళ్తుండగా.. సడన్‌గా షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు అవాక్కవుతున్నారు.
సోషల్ మీడియాలో ఓ పాత వీడియో (Viral Video) ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. పొలానికి కంచెగా వేసిన విద్యుత్ లైన్లపై ఓ పాము పాకుతూ వెళ్తోంది. వరసగా ఉన్న లైన్లపై (Snake crawling on electric wires) పాకుతూ వెళ్లిన పాము.. వాటి నుంచి కిందకు దూకే సమయంలో సడన్‌గా షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. లైన్ల మీద నుంచి ముందుకు జారే సమయంలో షాక్ కొట్టినట్లుగా కంపించింది. దీంతో అలాగే ఆగిపోయింది.
కొద్దిసేపటి తర్వాత కిందకు జారే సమయంలో (Snake gets electric shock) మళ్లీ కరెంట్ షాక్ కొడుతుంది. దీంతో మళ్లీ కాసేపు అలాగే ఆగిపోతుంది. ఇలా ఆ పాము ముందుకు కదిలినప్పుడల్లా షాక్ కొట్టినట్లు వణికిపోతుంటుంది. సాధారణంగా ఒకే లైనుపై వెళ్లిన సందర్భాల్లో పాములకు ఎలాంటి షాక్ కొట్టదని, రెండు లైన్లను తాకుతూ వెళ్లిన సందర్భాల్లో షాక్ కొడుతుందని నిపుణులు చెబుతున్నారు.
ఈ వీడియోలో పాముకు నిజంగా షాక్ కొట్టిందా.. లేదా అనే విషయం తెలీదు గానీ.. సోషల్ మీడియాలో మాత్రం తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘పాముకు షాక్ కొట్టడం మొదటిసారి చూస్తున్నాం’.. అంటూ కొందరు, ‘అరే ఇదేంటీ.. మరీ విచిత్రంగా ఉందే’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 1.2 మిలియన్లకు పైగా లైక్‌లు, 71 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
నిర్జీవంగా పడి ఉన్న భాగస్వామి.. గమనించిన హంస చివరకు ఏం చేసిందో చూస్తే..
వ్యూస్ కోసం భర్త అని కూడా చూడకుండా.. ఎలాంటి కామెంట్స్ చేసిందో చూస్తే..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Updated Date - Aug 07 , 2025 | 05:08 PM