Air India plane: ల్యాండింగ్‌కు ముందు ఎయిరిండియా విమానంలో రచ్చ.. చివరకు సిబ్బంది తీసుకున్న నిర్ణయంతో..
ABN, Publish Date - Jun 28 , 2025 | 07:44 PM
అమృత్‌సర్ నుంచి ఢిల్లీకి వెళ్తున్న ఎయిర్ ఇండియా AI454 విమానంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. విమానం ఢిల్లీలో ల్యాండ్ అవుతుందనగా.. ఇద్దరు ప్రయాణికుల మధ్య గొడవ మొదలైంది. చివరకు ఏం జరిగిందంటే..
ఎయిరిండియా.. ఈ పేరు వింటేనే అందరికీ అహ్మదాబాద్ ఘోర దుర్ఘటనే గుర్తుకొస్తుంది. టేకాఫ్ అయిన సెకన్ల వ్యవధిలోనే విమానం కూలిన ఘటనలో లోపల ఉన్న 241 మంది సహా మొత్తం 260 మంది దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటన ప్రపంచవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది. దీంతో ప్రస్తుతం ఎయిరిండియా విమానంలో ఏ చిన్న సంఘటన చోటు చేసుకున్నా కూడా తెగ వైరల్ అయిపోతోంది. ఈ నేపథ్యంలో తాజాగా, ఈ విమానంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. విమానం ల్యాండ్ అవుతున్న సమయంలో ఇద్దరు ప్రయాణికుల మధ్య గొడవ జరిగింది. దీంతో చివరకు విమానం సిబ్బంది అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. చివరకు ఏం జరిగిందంటే..
సోషల్ మీడియాలో ఓ వార్త (Viral News) తెగ వైరల్ అవుతోంది. అమృత్‌సర్ నుంచి ఢిల్లీకి వెళ్తున్న ఎయిర్ ఇండియా AI454 విమానంలో (Air India flight) షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. విమానం ఢిల్లీలో ల్యాండ్ అవుతుందనగా.. (Fight between two passengers) ఇద్దరు ప్రయాణికుల మధ్య గొడవ మొదలైంది.
ఒక ప్రయాణికుడు తోటి ప్రయాణికుడితో దురుసుగా ప్రవర్తించాడు. సీట్ల మధ్యలో నడక మార్గంలో నిలబడి.. మరో ప్రయాణికుడితో వాగ్వాదానికి దిగాడు. ఈ వాగ్వాదం కాస్తా కాసేపటికి గొడవకు దారి తీసింది. దీనిపై అక్కడున్న ప్రయాణికులు సిబ్బందికి సమాచారం అందించారు. చివరకు విమానం సిబ్బంది కలుగజేసుకుని.. బాధితుడిని బిజినెస్ క్లాస్ సీటులోకి మార్చారు. విమానం ఢిల్లీలో ల్యాండ్ అవగానే.. గొడవకు కారణమైన వ్యక్తిని విమానాశ్రయ భద్రతా సిబ్బందికి అప్పగించారు.
‘విమానంలో గొడవ జరగ్గానే.. సర్దుమణచడం కోసం మా సిబ్బంది రెండో ప్రయాణికుడిని బిజినెస్ క్లాస్ సీటులోకి మర్చారు’.. అంటూ సదరు ఎయిర్‌లైన పేర్కొంది. విమానంలో అంతరాయం కలిగించే వారిపై ఎయిర్‌లైన్ జీరో-టాలరెన్స్ విధానాన్ని అనుసరించి చర్యలు ఉంటాయని.. ప్రయాణికులు, సిబ్బంది భద్రత, శ్రేయస్సుకు ప్రాధాన్యత ఇస్తామని ఎయిరిండియా యాజమాన్యం తెలిపింది. కాగా, ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
బ్రిడ్జి వద్ద ఏకాంతంగా కలిసిన ప్రేమ జంట.. ఇంతలో పొంగుకొచ్చిన వరద నీరు.. చివరకు..
మీ దుంపలు తెగా.. చైనాను మించిపోయారు కదరా.. ఆమ్లెట్ ఎలా చేస్తున్నాడో చూడండి..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Updated Date - Jun 28 , 2025 | 07:44 PM