Home » Air india
గువాహటి నుంచి హైదరాబాద్ వెళ్లే విమానం అనివార్య కారణాల వల్ల రద్దు చేసినట్లు ఎయిర్ ఇండియా ప్రకటించింది. విమానాల జాప్యంపై భారత్ క్రికెటర్ సిరాజ్ అసంతృప్తి వ్యక్తంచేసిన నేపథ్యంలో ఆ సంస్థ గురువారం వివరణ ఇచ్చింది.
పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది గోపాల్ శంకరనారాయణ మాట్లాడుతూ, ప్రస్తుతం జరుగుతున్న ఏఏఐబీ దర్యాప్తు స్వతంత్ర దర్యాప్తు కాదని అన్నారు. తన క్లయింట్ స్వతంత్ర దర్యాప్తు కోరుతున్నారని చెప్పారు.
జూన్ 12వ తేదీన ఎయిర్ ఇండియాకు చెందిన ఏఐ 171 విమానం అహ్మదాబాద్‌లో ప్రమాదానికి గురైంది. టేకాఫ్ అయిన కొన్ని సెకన్లకే కుప్పకూలిపోయింది. దీంతో 270 మంది దాకా చనిపోయారు.
గ్రౌండ్ హ్యాండిలర్స్‌కు చెందిన బస్సు మధ్యాహ్నం సమయంలో మంటల్లో చిక్కుకుందని, అయితే ఏఆర్‌ఎఫ్ఎఫ్ నిపుణుల బృందం రెండు నిమిషాల్లోనే మంటలను అదుపు చేసిందని ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ అధికారిక 'ఎక్స్' ఖాతాలో తెలియజేసింది.
ఎయిర్ ఇండియా కీలక ప్రకటన చేసింది. ఒకటవ అకెంతో మొదలయ్యే సుమారు 60 డొమెస్టిక్ ఫ్లైట్లు ఢిల్లీ విమానాశ్రయంలోని టర్మినల్-2 నుంచి రాకపోకలు సాగిస్తాయని తాజాగా వెల్లడించింది.
ఏఏఐబీ అనేది విమాన ప్రమాదాలకు సంబంధించిన మేండేటెడ్ అథారిటీ అని, ఎవరి ప్రభావానికి లొంగకుండా వాస్తవాలను పరిగణనలోకి తీసుకుని అత్యంత పారదర్శకంగా, స్వతంత్రంగా దర్యాప్తు సాగిస్తుందని రామ్మోహన్ నాయుడు చెప్పారు.
వచ్చే చలికాలం షెడ్యూల్‌లో కేరళ నుంచి బయలుదేరే విమాన సర్వీసుల్లో భారీగా కోత విధించడంపై కాంగ్రెస్ ఎంపీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇది సరికాదని ఎయిర్ ఇండియాను ట్యాగ్ చేస్తూ ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు.
ఎయిర్‌లైన్స్ వర్గాల సమాచారం ప్రకారం ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ IX-1086 విమానం ఉదయం 8 గంటలకు బెంగళూరు నుంచి బయలుదేరింది. గాలిలో ఉండగా ఒక ప్రయాణికుడు కాక్‌పిట్ డోర్ వద్దకు వచ్చి దానిని తెరిచేందుకు ప్రయత్నించాడు.
ప్రమాదానికి కారణం పైలట్ల తప్పిదమేనని విచారణ పూర్తి కాకుండానే ఊహాగానాలు వ్యాప్తి చేయడం తగదని న్యాయమూర్తులు సూర్య కాంత్, ఎన్.కోటీశ్వర్ సింగ్లతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది.
అప్రమత్తమైన పైలట్ ప్రోటోకాల్ ప్రకారం విమానాన్ని తక్షణమే వెనక్కి మళ్లించి విశాఖ ఎయిర్పోర్ట్లో సురక్షితంగా ల్యాండ్ చేశారు. పైలట్ సమయానికి చాకచక్యంగా వ్యవహరించడంతో విమానంలో ఉన్న 103 మంది ప్రయాణికులు ప్రమాదం నుంచి బయటపడ్డారు.