Share News

Survivor Of Air India Crash: ఎయిర్ ఇండియా ప్రమాదం.. నరకం చూస్తున్న విశ్వాస్ కుమార్..

ABN , Publish Date - Nov 03 , 2025 | 02:58 PM

జూన్ 12వ తేదీన ఎయిర్ ఇండియాకు చెందిన ఏఐ 171 విమానం అహ్మదాబాద్‌లో ప్రమాదానికి గురైంది. టేకాఫ్ అయిన కొన్ని సెకన్లకే కుప్పకూలిపోయింది. దీంతో 270 మంది దాకా చనిపోయారు.

Survivor Of Air India Crash: ఎయిర్ ఇండియా ప్రమాదం.. నరకం చూస్తున్న విశ్వాస్ కుమార్..
Survivor Of Air India Crash

ఎయిర్ ఇండియాకు చెందిన ఏఐ 171 విమానం జూన్ 12వ తేదీన ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో విమానంలో ప్రయాణిస్తున్న 241 మంది చనిపోయారు. కేవలం లండన్‌కు చెందిన విశ్వాస్ కుమార్ రమేష్ మాత్రమే ప్రాణాలతో బయటపడ్డాడు. అదృష్టం బాగుండి చిన్న చిన్న గాయాలతోటే అతడు బయటపడ్డాడు. కానీ, ప్రమాదం నుంచి బతికి బయటపడ్డ సంతోషం అతడికి ఏమాత్రం లేదు. మానసికంగా, శారీరకంగా ప్రతీ రోజూ నరకం చూస్తూ ఉన్నాడు.


ట్రోమాతో అల్లాడిపోతున్నాడు. నాలుగు నెలలు అవుతున్నా ఇంకా ఆ సంఘటన నుంచి బయటపడలేకపోతున్నాడు. విశ్వాస్ కుమార్ తాజాగా ఓ అంతర్జాతీయ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆ ఇంటర్వ్యూలో అతడు మాట్లాడుతూ.. ‘ నాకు నాలుగు సంవత్సరాల కొడుకు ఉన్నాడు. ప్రమాదం తర్వాతినుంచి అతడితో పెద్దగా మాట్లాడటం లేదు. నేను రోజంతా ఒంటరిగా బెడ్‌పై కూర్చుని బాధపడుతూ ఉన్నాను.


నా సోదరుడు లేడన్న విషయాన్ని ఇంకా జీర్ణించుకోలేకపోతున్నాను. మెట్లు ఎక్కడానికి కూడా నాకు ఇబ్బందిగా ఉంది’ అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. యాంకర్ అడిగిన ప్రశ్నలకు కూడా సరిగా సమాధానాలు చెప్పలేకపోయాడు. ఎక్కువ సమయం మౌనంగా ఉండిపోయాడు. విశ్వాస్ కుమార్‌తో పాటు ఆ ఇంటర్వ్యూలో పాల్గొన్న మరో ఇద్దరు వ్యక్తులు మాత్రమే ఎక్కువ ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. బ్రిటన్ ప్రధాని కైర్ స్టార్మర్ ఎయిర్ ఇండియా బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని వారు కోరారు.


ఇవి కూడా చదవండి

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ పనులపై సీఎం రేవంత్‌రెడ్డి స్పెషల్ ఫోకస్

అడగడానికి ఇంకేమీ ప్రశ్నలు లేవా... నాయకత్వ మార్పుపై సిద్ధరామయ్య

Updated Date - Nov 03 , 2025 | 03:21 PM