Delhi Airport Fire: ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ఎయిరిండియా బస్సు దగ్ధం
ABN , Publish Date - Oct 28 , 2025 | 03:38 PM
గ్రౌండ్ హ్యాండిలర్స్‌కు చెందిన బస్సు మధ్యాహ్నం సమయంలో మంటల్లో చిక్కుకుందని, అయితే ఏఆర్‌ఎఫ్ఎఫ్ నిపుణుల బృందం రెండు నిమిషాల్లోనే మంటలను అదుపు చేసిందని ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ అధికారిక 'ఎక్స్' ఖాతాలో తెలియజేసింది.
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎయిరిండియా బస్సు దగ్ధమైంది. విమానాశ్రయం మూడో టెర్మినల్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఎయిర్‌క్రాఫ్ట్ రెస్క్యూ సిబ్బంది, అగ్నిమాక సిబ్బంది వెంటనే మంటలను అదుపు చేశారు. ట్యాక్సీయింగ్ ఏరియాలో నిలిపి ఉంచిన విమానానికి అత్యంత సమీపంలో ఈ ఘటన జరిగినప్పటికీ ఆ సమయంలో బస్సులో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.
గ్రౌండ్ హ్యాండిలర్స్‌కు చెందిన బస్సు మధ్యాహ్నం సమయంలో మంటల్లో చిక్కుకుందని, అయితే ఏఆర్‌ఎఫ్ఎఫ్ నిపుణుల బృందం రెండు నిమిషాల్లోనే మంటలను అదుపు చేసిందని ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ అధికారిక 'ఎక్స్' ఖాతాలో తెలియజేసింది. ఘటన సమయంలో బస్సులో ఎవరూ లేకపోవడంతో ఎవరికీ నష్టం జరగలేదని తెలిపింది. విమాన సర్వీసులు యథాప్రకారం నడుస్తున్నాయని తెలిపింది. ప్రయాణికులు, సిబ్బంది భద్రత తమకు అత్యంత ప్రాధాన్యమని పేర్కొంది.
ఇవి కూడా చదవండి..
అసలు ఈ ఎలక్ట్రిక్ బస్సులతోనే సమస్య..
మా బంధం పటిష్ఠం.. రాహుల్ ఆప్యాయత అమోఘం
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి