Minister: అసలు ఈ ఎలక్ట్రిక్ బస్సులతోనే సమస్య..
ABN , Publish Date - Oct 28 , 2025 | 01:23 PM
ఎలక్ట్రికల్ బస్సులతోనే సమస్య నెలకొందని తరచూ నగరంలో ప్రమాదాలు, బ్రేక్‌డౌన్‌లకు అవే కారణమని రవాణాశాఖ మంత్రి రామలింగారెడ్డి(Minister Ramalinga Reddy) తెలిపారు. విధానసౌధలో మంగళవారం మీడియాతో మాట్లాడారు. యూపీఏ పాలనలో ఎలక్ట్రికల్ బస్సులకు 80శాతం రాయితీ ఇచ్చి కార్పొరేషన్‌లకు అప్పగించేవారన్నారు.
- ప్రమాదాలు, బ్రేక్‌డౌన్‌లకు అవే కారణం
- రవాణాశాఖ మంత్రి రామలింగారెడ్డి
బెంగళూరు: ఎలక్ట్రికల్ బస్సులతోనే సమస్య నెలకొందని తరచూ నగరంలో ప్రమాదాలు, బ్రేక్‌డౌన్‌లకు అవే కారణమని రవాణాశాఖ మంత్రి రామలింగారెడ్డి(Minister Ramalinga Reddy) తెలిపారు. విధానసౌధలో మంగళవారం మీడియాతో మాట్లాడారు. యూపీఏ పాలనలో ఎలక్ట్రికల్ బస్సులకు 80శాతం రాయితీ ఇచ్చి కార్పొరేషన్‌లకు అప్పగించేవారన్నారు. ప్రస్తుతం ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణను సదరు సంస్థలకే అప్పగించారన్నారు.

వారు నియమించినవారే డ్రైవర్లుగా ఉన్నారని, నిర్వహణ లేకపోవడంతో తరచూ బ్రేక్‌డౌన్‌లు అవుతున్నాయన్నారు. ప్రస్తుతం ఎన్‌టీపీసీ 90 బస్సులు, స్విచ్ మొబిలిటీ 300 బస్సులు, టీఎంఎల్ స్మార్ట్‌సిటీ బస్సులు 1031, ఓహెచ్‌ఎం గ్లోబల్ 251 బస్సులు ఉన్నాయన్నారు. చార్జింగ్‌స్టేషన్‌లు ప్రతిడిపోలోనూ అనుకూలం చేశామన్నారు. అయినా బస్సులలో సాంకేతిక వైఫల్యాలు, బ్యాటరీ సంబంధిత సమస్యలు, ప్రమాదాల సంఖ్య పెరగడం, బస్సుల నిర్వహణా లోపం, అనుభవం లేని డ్రైవర్లు, బస్సులు నిరంతరం జాప్యం, డ్రైవర్ల కొరత, డ్రైవర్ల ఆందోళన వంటివి వెంటాడుతున్నాయన్నారు.

గతంలో మాదిరిగా కార్పొరేషన్లకు బస్సులను పూర్తిస్థాయిలో అప్పగిస్తే పర్యవేక్షణ సముచితంగా ఉంటుందన్నారు. ఇదే విషయమై కేంద్రమంత్రి కుమారస్వామికి ప్రత్యేక లేఖ పంపానన్నారు. బెంగళూరులో అందుబాటులో ఉన్నప్పుడు భేటీ అవుతానన్నారు. ఎలక్ట్రిక్ బస్సు కంపెనీల నిర్వాహకులతోనే పది విడతలకుపైగా ప్రత్యేక సమావేశాలు జరిపామని, అయినా సమస్య పరిష్కారం కాలేదన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
వరుసగా రెండో రోజూ తగ్గిన గోల్డ్ రేట్స్
Read Latest Telangana News and National News