Gold Price Drop Oct 28: వరుసగా రెండో రోజూ తగ్గిన గోల్డ్ రేట్స్
ABN , Publish Date - Oct 28 , 2025 | 11:10 AM
అంచనాలకు తగ్గట్టుగానే ఈవారం వరుసగా రెండో రోజూ పసిడి వెండి ధరల్లో తగ్గుదల కనిపించింది. ప్రస్తుతం దేశంలో 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.1,22,460గా ఉంది.
ఇంటర్నెట్ డెస్క్: ఇటీవలి వరకూ చుక్కలనంటిన పసిడి ధరలు క్రమంగా దిగొస్తున్నాయి. మంగళవారం కూడా పసిడి, వెండి ధరల్లో తగ్గుదల కనిపించింది. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, ప్రస్తుతం దేశంలో 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర నిన్నటితో పోలిస్తే రూ. 820 మేర తగ్గి రూ.1,22,460కు చేరుకుంది. ఇక ఆర్నమెంటల్ బంగారం ధర రూ.750 మేర తగ్గి 1,12,250కు చేరుకుంది (Gold Rates Drop on Oct 28).
వెండి ధరల్లో కూడా భారీ కోత పడింది. కిలో వెండి ధర సుమారు రూ.4 వేల మేర తగ్గి రూ.1,51,000కు చేరుకుంది. ఇక హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ బంగారం ధర రూ.1,22,460గా ఉంది. ఆర్నమెంటల్ బంగారం ధర రూ.1,12,250గా ఉంది.
ఇక అంతర్జాతీయ మార్కెట్‌లోనూ పసిడి ధరల్లో భారీ తగ్గుదల కనిపిస్తోంది. ఔన్స్ 24 క్యారెట్ బంగారం 3986 డాలర్ల వద్ద కొనసాగుతోంది. నిన్నటితో పోలిస్తే సుమారు 3 శాతం మేర ధరల్లో కోత పడింది. మల్టీ కమోడిటీ ఎక్సేంజ్‌లో గోల్డ్ డిసెంబర్ ఫ్యూచర్స్ ధర కూడా 2.35 శాతం మేర తగ్గి రూ.1,20,546 వద్ద కొనసాగుతోంది.
ధరల తగ్గుదలకు కారణాలు
మలేషియా వేదికగా అమెరికా, చైనా ప్రతినిధుల మధ్య జరిగిన చర్చలు సానుకూల ఫలితాలను ఇచ్చాయి. ఎగుమతులపై నియంత్రణలు, డ్రగ్స్ కట్టడి, షిప్పింగ్ లెవీల వంటి వాటిపై ఇరు దేశాల మధ్య ప్రాథమిక స్థాయిలో ఏకాభిప్రాయం కుదరడంతో బంగారానికి డిమాండ్ తగ్గింది.
టిక్‌టాక్ విక్రయంపై భేదాభిప్రాయాలు తొలగిపోయాయని, చైనాపై 100 శాతం సుంకం కూడా ఉండబోదని అమెరికా ట్రెజరీ సెక్రటరీ బెసెంట్ ప్రకటించడంతో మళ్లీ స్టాక్ మార్కెట్ పెట్టుబడులు ఆకర్షణీయంగా మారాయి. అమెరికాలో ద్రవ్యోల్బణం తగ్గడం కూడా మదపర్లకు కొత్త ఊపునిచ్చింది.
గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. వార్త రాస్తున్న సమయానికి ధరల వివరాలు పైన తెలిపిన విధంగా ఉన్నాయి. కాబట్టి బంగారం కొనుగోలు చేసే ముందు.. ధరలు మళ్లీ ఒకసారి పరిశీలించుకోగలరు.
ఇవీ చదవండి:
ప్రభుత్వ బ్యాంకుల్లోకి 49శాతం విదేశీ పెట్టుబడులు
అమెరిజాన్‌లో భారీ స్థాయిలో తొలగింపులకు రంగం సిద్ధం.. 30 వేల మందిపై వేటు
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి