Share News

ఎయిర్‌ ఇండియా విమాన సమయం మార్పు

ABN , Publish Date - Jan 22 , 2026 | 12:18 PM

తిరుపతికి వచ్చే ఎయిర్‌ ఇండియా విమాన సర్వీసు సమయాన్ని మార్చారు. ఢిల్లీ నుంచి హైదరాబాదు మీదుగా తిరుపతికి విమాన సర్వీసు ఉంది. అయితే.. దాని సమయంలో మార్పులు చేశారు. ఆ వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

ఎయిర్‌ ఇండియా విమాన సమయం మార్పు

రేణిగుంట: ఢిల్లీ నుంచి హైదరాబాదు మీదుగా తిరుపతి(Tirupati)కి వచ్చే ఎయిర్‌ ఇండియా విమాన సర్వీసు సమయాన్ని మార్చారు. ఇప్పటి వరకు మధ్యాహ్నం 2.10గంటలకు రేణిగుంటకు వచ్చే ఈ విమానం 3.10గంటలకు ఢిల్లీ(Delhi)కి బయలుదేరి వెళ్లేది. బుధవారం నుంచి మధ్యాహ్నం 1.45గంటలకు రేణిగుంట(Renigunta)కు చేరుకుని, 2.10గంటలకు ఢిల్లీకి బయలుదేరి వెళుతుంది.కాగా హైదరాబాదు నుంచి రేణిగుంటకు 7.15గంటలకు వచ్చి 7.40గంటలకు వెళ్లాల్సిన ఎయిర్‌ అలయన్స్‌ విమానం ఆలస్యంగా 9.10గంటలకు వచ్చి 9.40గంటలకు వెళ్లింది. అలాగే ముంబై నుంచి 5.20గంటలకు వచ్చి 6.10గంటలకు వెళ్లాల్సిన ఇండిగో విమానం 40 నిమిషాలు ఆలస్యంగా నడిచింది.


nani2.2.jpg

ఈ వార్తలు కూడా చదవండి.

పెంపుడు కుక్కకు.. మేడారంలో తులాభారం! క్షమాపణలు చెప్పిన.. హీరోయిన్‌

పాలిచ్చే పశువులకు చికెన్‌, మటన్‌ వ్యర్థాలు!

Read Latest Telangana News and National News

nani2,3.jpg

Updated Date - Jan 22 , 2026 | 12:19 PM