అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. ఎయిరిండియాకు రూ.1,100 కోట్లు..
ABN , Publish Date - Jan 24 , 2026 | 04:11 PM
గతేడాది అహ్మదాబాద్‌లో భయంకర విమాన ప్రమాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. గతేడాది జూన్ 12న అహ్మదాబాద్ నుంచి లండన్ బయల్దేరిన విమానం టేకాఫ్ అయిన కాసేపటికే ఓ మెడికల్ కాలేజ్ హాస్టల్‌పై కుప్పకూలింది. ఈ ప్రమాదంలో దాదాపు 260 మంది ప్రాణాలు కోల్పోయారు.
గతేడాది అహ్మదాబాద్‌లో భయంకర విమాన ప్రమాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. గతేడాది జూన్ 12న అహ్మదాబాద్ నుంచి లండన్ బయల్దేరిన విమానం టేకాఫ్ అయిన కాసేపటికే ఓ మెడికల్ కాలేజ్ హాస్టల్‌పై కుప్పకూలింది. ఈ ప్రమాదంలో దాదాపు 260 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదానికి సంబంధించి ఎయిరిండియాకు రూ.1,100 కోట్ల బీమా సొమ్ము తాజాగా లభించింది (Air India aircraft damage).
విమానం పూర్తిగా ధ్వంసం కావడంతో రీ-ఇన్సూరర్లు, బీమా సంస్థలు 125 మిలియన్ డాలర్ల బీమా మొత్తాన్ని ఎయిరిండియాకు చెల్లించాయి. అలాగే ప్రమాదంలో మరణించిన వారి బంధువులకు మరో 25 మిలియన్ డాలర్ల పరిహారం చెల్లించే ప్రక్రియ కూడా ప్రారంభమైందని బీమా సంస్థలు తెలిపాయి. అయితే ఆ ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదని, పరిహారం మొత్తం మరింత పెరిగే అవకాశం కూడా ఉందని వెల్లడించాయి (aviation insurance payout).
ఈ విమాన ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించేందుకు టాటా గ్రూపు ఓ ట్రస్ట్‌ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే (reinsurers claim settlement). చనిపోయిన వారి బంధువులకు పరిహారం ఇవ్వడంతో పాటు, క్షతగాత్రుల వైద్య ఖర్చులు, మెడికల్ కాలేజ్ హాస్టల్ పునరుద్ధరణ, విమాన శకలాల వల్ల దెబ్బ తిన్న ఇతర నిర్మాణాలను పునరుద్ధరించడం వంటి పనులను ఈ ట్రస్ట్ పర్యవేక్షిస్తుంది.
ఇవి కూడా చదవండి..
అమెరికాను వణికిస్తున్న మంచు తుఫాను.. స్థంభించిన జన జీవనం.. వేల విమాన సర్వీసులు రద్దు..
ఈమెకు సహాయం చేయండి.. ఈ ఇంటి తాళం చెవి ఎక్కడుందో 13 సెకెన్లలో కనిపెట్టండి..