Air India Plane Crash: ఎయిరిండియా ప్రమాదంపై పారదర్శకంగా దర్యాప్తు.. రామ్మోహన్ నాయుడు
ABN , Publish Date - Oct 07 , 2025 | 06:23 PM
ఏఏఐబీ అనేది విమాన ప్రమాదాలకు సంబంధించిన మేండేటెడ్ అథారిటీ అని, ఎవరి ప్రభావానికి లొంగకుండా వాస్తవాలను పరిగణనలోకి తీసుకుని అత్యంత పారదర్శకంగా, స్వతంత్రంగా దర్యాప్తు సాగిస్తుందని రామ్మోహన్ నాయుడు చెప్పారు.
న్యూఢిల్లీ: అహ్మదాబాద్‌లో జూన్ 12న జరిగి ఎయిరిండియా విమాన ప్రమాదం (Air India Plane Crash)పై ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB) అత్యంత పారదర్శకంగా దర్యాప్తు జరుగుతోందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె.రామ్మెహన్ నాయుడు (Rammohan Naidu) తెలిపారు. దర్యాప్తులో ఎలాంటి అవకతవకలకు తావులేదని చెప్పారు. ఏఏఐబీ ఇచ్చిన ప్రాథమిక నివేదకపై పలు విమర్శలు వచ్చిన నేపథ్యంలో కేంద్ర మంత్రి తాజా వివరణ ఇచ్చారు.
'తుది నివేదిక రావడానికి కొంత సమయం పడుతుంది. ఏఏఐబీ అత్యంత పారదర్శకత్వంగా, స్వతంత్ర పద్ధతిలో దర్యాప్తు జరుపుతోంది. నివేదికపై తొందరపెట్టాలని మేము అనుకోవడం లేదు. దర్యాప్తు పూర్తి చేయడానికి తప్పనిసరిగా వారికి సొంత సమయం అవసరమవుతుంది' అని మంగళవారంనాడిక్కడ మీడియాతో మాట్లాడుతూ మంత్రి చెప్పారు. ఏఏఐబీ అనేది విమాన ప్రమాదాలకు సంబంధించిన మేండేటెడ్ అథారిటీ అని, ఎవరి ప్రభావానికి లొంగకుండా వాస్తవాలను పరిగణనలోకి తీసుకుని అత్యంత పారదర్శకంగా, స్వతంత్రంగా దర్యాప్తు సాగిస్తుందని చెప్పారు. తుది నివేదిక వచ్చేంత వరకూ ప్రజలు ఓపిక పట్టాలని కోరారు. ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైన వివరాలను ఆధారంగా వ్యాఖ్యానించడం సరికాదన్నారు. తుది నివేదిక వచ్చేంత వరకూ వేచిచూడాల్సి ఉంటుందని చెప్పారు.
అహ్మదాబాద్ నుంచి లండన్‌కు జూన్ 12న బయలుదేరిన ఎయిరిండియా విమానం కొద్ది క్షణాల్లోనే కుప్పకూలింది. ఒక హాస్టల్ భవనంపై విమానం కుప్పకూలడంతో విమానంలోని 2412 మంది, హాస్టల్ సిబ్బంది 19 మంది మృతిచెందారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనమైంది.
ఇవి కూడా చదవండి..
బిగ్ బ్రదర్ ఎవరూ లేరు... ఆ రెండు పార్టీలకు చెరి సగం
ఏడాది తర్వాత కేజ్రీవాల్‌కు ప్రభుత్వ బంగ్లా కేటాయింపు
Read Latest Telangana News and National News