Kejriwal Gets Bungalow: ఏడాది తర్వాత కేజ్రీవాల్‌కు ప్రభుత్వ బంగ్లా కేటాయింపు
ABN , Publish Date - Oct 07 , 2025 | 04:02 PM
కేజ్రీవాల్ 2024 సెప్టెంబర్ 17న ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. నవంబర్ 4న ఫ్లాగ్‌స్టాఫ్ రోడ్డులోని అధికారిక బంగ్లాను ఖాళీ చేసి ఆప్ పంజాబ్ రాజ్యసభ ఎంపీ అశోక్ మిట్టల్ ఇంట్లో తాత్కాలికంగా ఉంటున్నారు. బంగ్లా కేటాయింపులో జరుగుతున్న జాప్యంపై ఆయన ఇటీవల ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.
న్యూఢిల్లీ: ఏడాది కాలంగా అధికారిక నివాసం కోసం ఎదురుచూస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) నేషనల్ కన్వీనర్, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal)కు ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం అధికారిక బంగ్లా కేటాయించింది. ఆయన కోరినట్టు బీఎస్‌పీ అధినేత్ర మాయావతి నివసించిన బంగ్లాకు బదులుగా సెకెండ్ లార్జెస్ట్ కేటగిరి కింది లోధి ఎస్టేట్ టైప్-7 బంగ్లాను కేటాయించింది. ఈ బంగ్లాలో ఇంతకుముందు మాజీ ఐపీఎస్ అధికారి, బీజేపీ నేత ఇక్బాల్ సింగ్ లాల్‌పుర ఉండేవారు.
హైకోర్టు జోక్యంతో..
కేజ్రీవాల్ 2024 సెప్టెంబర్ 17న ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. నవంబర్ 4న ఫ్లాగ్‌స్టాఫ్ రోడ్డులోని అధికారిక బంగ్లాను ఖాళీ చేసి ఆప్ పంజాబ్ రాజ్యసభ ఎంపీ అశోక్ మిట్టల్ ఇంట్లో తాత్కాలికంగా ఉంటున్నారు. బంగ్లా కేటాయింపులో జరుగుతున్న జాప్యంపై ఆయన ఇటీవల ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. గుర్తింపు పొందిన జాతీయ పార్టీ అధ్యక్షుడి హోదాలో తనకు తగిన ఇల్లు కేటాయించాలని కోరారు. గత మేలో బీఎస్‌పీ అధినేత్రి మాయావతి ఖాళీ చేసిన భవనం తనకు కేటాయించాలని ప్రభుత్వానికి ఆయన విజ్ఞప్తి చేశారు. అయితే ఆ బంగ్లాను గత జూలైలో కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరికి కేటాయించారు.
కాగా, జాతీయ పార్టీ అధ్యక్షుడిగా కేజ్రీవాల్‌కు బంగ్లా కేటాయింపులో జరుగుతున్న జోక్యంపై హైకోర్టు కేంద్రాన్ని ప్రశ్నించింది. దీంతో పది రోజుల్లోగా అధికారిక బంగ్లా కేటాయించగలమని సెప్టెంబర్ 25న కేంద్రం హైకోర్టుకు తెలియజేసింది. తాజాగా టైప్-7 బంగ్లాను కేజ్రావాల్‌కు ప్రభుత్వం కేటాయించింది. ఇందులో నాలుగు బెడ్‌రూమ్‌లు, పెద్ద లాన్‌లు, గ్యారేజీ, మూడు సర్వెంట్ క్వార్టర్లు, ఆఫీసు వసతి ఉన్నాయి.
ఇవి కూడా చదవండి..
అన్నాడీఎంకే వైపు విజయ్ చూపు.. పొత్తుపై రహస్య మంతనాలు
కరూర్ తొక్కిసలాట ఘటనపై సుప్రీంకోర్టులో పిటిషన్..
Read Latest Telangana News and National News