Karur Case Supreme: కరూర్ తొక్కిసలాట ఘటనపై సుప్రీంకోర్టులో పిటిషన్..
ABN , Publish Date - Oct 07 , 2025 | 12:41 PM
టీవీకే అధ్యక్షుడు విజయ్ తమిళనాడులోని కరూర్‌లో నిర్వహించిన బహిరంగ సభలో తొక్కిసలాట జరిగి 41 మంది మృతిచెందిన విషయం తెలిసిందే. సభలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు విజయ్ రూ.20 లక్షల చొప్పున పరిహారం అందించారు.
ఢిల్లీ: టీవీకే చీఫ్, నటుడు విజయ్ కరూర్ ర్యాలీ సందర్భంగా జరిగిన తొక్కిసలాట అంశం సుప్రీంకోర్టుకు చేరింది. సీబీఐ దర్యాప్తు కోరుతూ దాఖలైన పిటిషన్‌ను కొట్టివేయాలని మద్రాస్ హైకోర్టు తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌ను విచారించేందుకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం అంగీకరించింది. ఈ మేరకు అక్టోబర్ 10న సుప్రీంకోర్టులో కేసు విచారణ జరగనున్నట్లు సమాచారం.
టీవీకే అధ్యక్షుడు విజయ్ తమిళనాడులోని కరూర్‌లో నిర్వహించిన బహిరంగ సభలో తొక్కిసలాట జరిగి 41 మంది మృతిచెందిన విషయం తెలిసిందే. సభలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు విజయ్ రూ.20 లక్షల చొప్పున పరిహారం అందించారు. అయితే విజయ్ ర్యాలీలో తొక్కిసలాటపై సీబీఐ దర్యాప్తు కోరుతూ భారతీయ జనతా పార్టీ నేత ఉమా ఆనందన్ మద్రాసు హైకోర్టులో పిటిషన్ వేశారు. ఉమా ఆనందన్ వేసిన పిటిషన్‌ను కోర్టు తోసిపుచ్చింది. ఈ నేపథ్యంలో మద్రాస్ హైకోర్టు నిర్ణయాన్ని సవాలు చేస్తూ.. సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు అయ్యింది.
ఇవి కూడా చదవండి..
ఎన్నికల ప్రక్రియ సరళం.. శాంతిభద్రతలపై డేగకన్ను
బిహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల, జూబ్లీహిల్స్ బైపోల్ కూడా..