Share News

TVK Vijay: అన్నాడీఎంకే వైపు విజయ్‌ చూపు.. పొత్తుపై రహస్య మంతనాలు

ABN , Publish Date - Oct 07 , 2025 | 01:17 PM

కరూర్‌ తొక్కిసలాట ఘటనతో తీవ్రంగా నష్టపోయిన ‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే).. నష్టనివారణ చర్యలకు దిగిందా?.. అధికార డీఎంకేను ఒంటరిగా అడ్డుకోవడం కష్ట సాధ్యంగా మారడంతో.. అన్నాడీఎంకేతో చేతులు కలిపేందుకు సిద్ధమైందా?.. ఆ పార్టీ అధినేత విజయ్‌ ఆదేశాల మేరకు క్రియాశీలక నేతలు.. అన్నాడీఎంకేతో మంతనాలు సాగిస్తున్నారా?.. అవుననే అంటున్నాయి అత్యంత విశ్వసనీయ రాజకీయ వర్గాలు.

TVK Vijay: అన్నాడీఎంకే వైపు విజయ్‌ చూపు.. పొత్తుపై రహస్య మంతనాలు

చెన్నై: కరూర్‌ తొక్కిసలాట ఘటనతో తీవ్రంగా నష్టపోయిన ‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే).. నష్టనివారణ చర్యలకు దిగిందా?.. అధికార డీఎంకేను ఒంటరిగా అడ్డుకోవడం కష్ట సాధ్యంగా మారడంతో.. అన్నాడీఎంకేతో చేతులు కలిపేందుకు సిద్ధమైందా?.. ఆ పార్టీ అధినేత విజయ్‌ ఆదేశాల మేరకు క్రియాశీలక నేతలు.. అన్నాడీఎంకేతో మంతనాలు సాగిస్తున్నారా?.. అవుననే అంటున్నాయి అత్యంత విశ్వసనీయ రాజకీయ వర్గాలు.

రెండేళ్ల క్రితం పార్టీని ప్రారంభించిన విజయ్‌(Vijay).. వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు కదనోత్సాహంతో సిద్ధమవుతున్న విషయం తెలిసిందే.


ఇందులో భాగంగా వారానికి రెండురోజులు జిల్లా కేంద్రాల్లో బస్సు ప్రచారం చేపడుతున్నారు. అధికార డీఎంకేపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల కరూర్‌ ప్రచారం సందర్భంగా తొక్కిసలాట జరిగి.. 41 మంది మరణించిన విషయం తెలిసిందే. ఈ ఘటన నేపథ్యంలో పోలీసుల అరెస్టుకు భయపడి పార్టీ ప్రధాన కార్యదర్శి బుస్సీ ఆనంద్‌ సహా ప్రముఖులంతా అజ్ఞాతంలోకి వెళ్లిపోవటంతో ఆ పార్టీ డైలమాలో పడిపోయింది. కరూర్‌ దుర్ఘటనపై డీఎంకే తీవ్రంగా స్పందించకపోయినా ఆ ఘటనకు బాధ్యులు ఆ పార్టీయేనన్నట్లుగా విజయ్‌ వేలెత్తి చూపుతున్నారు.


ఈ ఘటనపై నిరాధార పరస్పర ఆరోపణలకు దిగవద్దని, సంయమనం పాటించాలంటూ ముఖ్యమంత్రి స్టాలిన్‌ చేసిన ప్రకటన్ని సైతం విజయ్‌ పట్టించుకున్నట్లుగా కనిపించడం లేదు. అయితే ప్రభుత్వ యంత్రాంగం మాత్రం టీవీకేదే తప్పు అన్నట్లుగా చర్యలకు దిగింది. ఇదే సమయంలో బీజేపీ, అన్నాడీఎంకేలు విజయ్‌ పార్టీని సమర్థిస్తూ ప్రకటనలు చేస్తున్నాయి. అన్నాడీఎంకే అధినేత, మాజీ ఎడప్పాడి పళనిస్వామి అయితే ఈ దుర్ఘటనతో విజయ్‌కి ఎలాంటి సంబంధం లేదన్న ధోరణితో ప్రకటనలు గుప్పిస్తున్నారు.


nani3.2.jpg

అంతేకాకుండా విజయ్‌పై ఎలాంటి విమర్శలు చేయవద్దంటూ రెండు పార్టీల నేతలకు మౌఖిక ఆదేశాలు కూడా వెళ్లినట్లు తెలిసింది. ఇక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నయినార్‌ నాగేంద్రన్‌, మాజీ అధ్యక్షుడు అన్నామలై, ఆ పార్టీ సీనియర్‌ నేత హెచ్‌. రాజా విజయ్‌కి మద్దతుగానే వ్యాఖ్యలు చేస్తున్నారు. కరూర్‌ దుర్ఘటనకు రోడ్‌షోలో తగిన భద్రతా ఏర్పాట్లు చేపట్టని డీఎంకే ప్రభుత్వమే ప్రధాన కారణమని ఆరోపిస్తున్నారు.


పోస్టర్ల కలకలం...

అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకోవాలా? వద్దా? అని టీవీకే అధినేత విజయ్‌ మల్లగుల్లాలు పడుతుండగానే పార్టీ శ్రేణులు ఆయన అనుమతి తీసుకోకుండా మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి(ఈపీఎ్‌స)ని స్వాగతిస్తున్నట్లు రాష్ట్రవ్యాప్తంగా పోస్టర్లు అంటిస్తున్నారు. ఇకపై ఎడప్పాడి పాల్గొనే సభలు ఎక్కడ జరిగినా విజయ్‌, ఈపీఎస్‌ ఫొటోలతో స్వాగత బ్యానర్లు ఏర్పాటు చేస్తామంటూ సినీ అభిమానాలు, పార్టీ కార్యకర్తలు చెబుతున్నారు.


ఈ పరిస్థితులలో విజయ్‌ని ఎన్డీయేలో చేర్చుకోవాలని అన్నాడీఎంకే నేతలు, బీజేపీ నేతలు తీవ్ర ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఎన్డీయేకి, తనకు రాజకీయ ప్రత్యర్థి డీఎంకే కనుక ఉమ్మడి శత్రువైన స్టాలిన్‌ ఢీకొనడానికి మెగా కూటమిలో చేరటమే మంచిదని విజయ్‌ భావిస్తున్నట్లు తెలిసింది. ఆ మేరకు టీవీకే క్రియాశీలక నేతలు అన్నాడీఎంకే నేతలతో చర్చిస్తున్నట్లు తెలిసింది.


ఈ వార్తలు కూడా చదవండి..

పసిడి పరుగులు.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

ఆల్మట్టి ఎత్తు తగ్గింపుపై హామీతో రావాలి

బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్‌ రాజకీయం

Read Latest Telangana News and Nationa

Updated Date - Oct 07 , 2025 | 01:17 PM