Share News

Lovers Viral Video: బ్రిడ్జి వద్ద ఏకాంతంగా కలిసిన ప్రేమ జంట.. ఇంతలో పొంగుకొచ్చిన వరద నీరు.. చివరకు..

ABN , Publish Date - Jun 27 , 2025 | 07:53 PM

నర్మదా నది బ్రిడ్జ్ వద్ద ఈ సంఘటన చోటు చేసుకుంది. ఓ ప్రేమ జంట ఎవరూ చూడకుండా నదిలోని బ్రిడ్జి వద్ద కలుసుకునేందుకు వెళ్లింది. అంతటితో ఆగకుండా బ్రిడ్జ్ మధ్యలోకి వెళ్లి, అక్కడి పిల్లర్స్ మధ్యలో కూర్చున్నారు. ఇద్దరూ సరదాగా మాట్లాడుకుంటుండగా..

Lovers Viral Video: బ్రిడ్జి వద్ద ఏకాంతంగా కలిసిన ప్రేమ జంట.. ఇంతలో పొంగుకొచ్చిన వరద నీరు.. చివరకు..

ప్రేమ గుడ్డిది అంటారు పెద్దలు. కానీ ప్రస్తుత సమాజంలో ప్రేమికులు కళ్లున్న గుడ్డి వారిలా మారిపోతున్నారు. అంతా చూస్తున్నారనే కనీస స్పృహ కూడా లేకుండా బహిరంగ ప్రదేశాల్లో అసభ్యకరంగా ప్రవర్తించడం, బైకుల్లో వెళ్తూ పిచ్చి చేష్టలు చేయడం, పార్కుల్లో జనాల సమక్షంలోనే హద్దులు దాటడం చేస్తుంటారు. ఇలాంటి సంఘటనలకు సంబంధించిన వీడియోలను నిత్యం చూస్తూనే ఉంటాం. తాజాగా, ఓ ప్రేమ జంటకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ ప్రేమ జంట బ్రిడ్జి వద్ద ఏకాంతంగా కలుసుకోవడానికి వెళ్లింది. అయితే ఇంతలో వరద నీరు పొంగుకొచ్చింది. చివరకు ఏమైందో మీరే చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. గుజరాత్‌లోని (Gujarat) నర్మదా నది బ్రిడ్జ్ వద్ద ఈ సంఘటన చోటు చేసుకుంది. ఓ ప్రేమ జంట (Lovers) ఎవరూ చూడకుండా నదిలోని బ్రిడ్జి వద్ద కలుసుకునేందుకు వెళ్లింది. అంతటితో ఆగకుండా బ్రిడ్జ్ మధ్యలోకి వెళ్లి, అక్కడి పిల్లర్స్ మధ్యలో కూర్చున్నారు. ఇద్దరూ సరదాగా మాట్లాడుకుంటుండగా.. సడన్‌గా షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.


అప్పటిదాకా తక్కువ స్థాయిలో ప్రవహిస్తున్న వరద నీరు (flood water) .. ఒక్కసారిగా పోటెత్తింది. చూస్తుండగానే వరద నీరు అంతకంతకూ పెరిగి, చివరకు భీకరంగా ప్రవహించడం స్టార్ట్ అయింది. తమ చుట్టూ వరద నీరు చేరడం చూసి ఆ ప్రేమ జంట షాక్ అయింది. అయితే చివరకు అక్కడున్న వారు గమనించడంతో స్థానికులు అలెర్ట్ అయ్యారు. అంతా కలిసి పడవలు తీసుకెళ్లి, వారిద్దరినీ క్షేమంగా ఒడ్డుకు తీసుకొస్తారు. దీంతో అప్పటిదాకా భయం భయంగా ఉన్న ప్రేమ జంట చివరకు హమ్మయ్య.. అంటూ ఊపిరి పీల్చుకుంది.


కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘అక్కడికి ఎలా వెళ్లారబ్బా.. ఇది ఆలోచించాల్సిన విషయమే’.. అంటూ కొందరు, ‘ఇంతగా ఫేమస్ అవతామని ఊహించి ఉండరు’.. అంటూ మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 2 లక్షలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.


ఇవి కూడా చదవండి..

మీ దుంపలు తెగా.. చైనాను మించిపోయారు కదరా.. ఆమ్లెట్ ఎలా చేస్తున్నాడో చూడండి..

అర్ధరాత్రి టెంట్‌‌లో కొత్త జంటలు.. సమీపానికి వెళ్లిన సింహాలు.. చివరకు..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Jun 27 , 2025 | 08:30 PM