ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Love Marriage: ప్రేమ పెళ్లికి పెద్దల అంగీకారం.. నిశ్చితార్థం రోజే ప్రియుడి ఆత్మహత్య.. కారణం తెలిస్తే..

ABN, Publish Date - May 23 , 2025 | 09:30 AM

ప్రేమికులు తమ ప్రేమను పెళ్లి వరకూ తీసుకెళ్లేందుకు ఎంతకైనా తెగిస్తారు. ఒకవేళ ప్రేమ వివాహానికి పెద్దలు అంగీకరిస్తే.. ఇక వారి ఆనందానికి అవధులు ఉండవు. ఇప్పుడీ ప్రస్తావన ఎందుకొచ్చిందంటే.. ఓ ప్రేమ వివాహానికి పెద్దలు అంగీకరించారు. అయినా నిశ్చితార్థం రోజే ప్రియుడు ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళితే..

ప్రేమికులు తమ ప్రేమను పెళ్లి వరకూ తీసుకెళ్లేందుకు ఎంతకైనా తెగిస్తారు. ఏదోటి చేసి పెద్దలను ఒప్పించడానికి ప్రయత్నిస్తుంటారు. ఒకవేళ వారు ఒప్పుకోని పక్షంలో పారిపోయి పెళ్లి చేసుకుంటారు. అంతేకానీ.. తమ ప్రేమను మాత్రం వదలుకోరు. ఒకవేళ ప్రేమ వివాహానికి పెద్దలు అంగీకరిస్తే.. ఇక వారి ఆనందానికి అవధులు ఉండవు. ఇప్పుడీ ప్రస్తావన ఎందుకొచ్చిందంటే.. తాజాగా, కర్నూలు జిల్లాలో ఓ ప్రేమ వివాహానికి పెద్దలు అంగీకరించారు. అయితే నిశ్చితార్థం రోజే ప్రియుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..


కర్నూలు జిల్లా (Kurnool District) ఆదోని మండలం హనవాల్లు గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన రాజు, హిమజ్యోతి కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే వీరి ప్రేమ విషయం కొన్నాళ్లకు ఇంట్లో పెద్దలకు తెలిసింది. వీరి ప్రేమ వివాహాన్ని (Love Marriage) వ్యతిరేకిస్తానుకున్న పెద్దలు.. అందుకు విరుద్ధంగా అంగీకరించారు. అయితే హిమజ్యోతి తల్లిదండ్రులు ఓ కండీషన్ పెట్టారు.


వివాహం క్రిస్టియన్ పద్ధతిలోనే చేయాలని షరతు విధించారు. ఈ ఒక్క షరతుతో సమస్య మొదలైంది. తన వివాహాన్ని హిందూ సాంప్రదాయం ప్రకారమే చేసుసుకుంటానని రాజు భీష్మించుకున్నాడు. దీంతో ఇరు కుటుంబాల పెద్దలు కలుగజేసుకుని చర్చించారు. చివరకు వారి వివాహాన్ని క్రిస్టియన్ సాంప్రదాయం (Christian tradition) ప్రకారమే చేయాలని నిర్ణయించారు. దీంతో రాజు తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు.


నిశ్చితార్థం సందర్భంగా అతిథులంతా వారి ఇళ్లకు చేరుకున్నారు. అంతా సందడిగా ఉన్న సమయంలో సడన్‌గా షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. అప్పటికే ఆందోళనలో ఉన్న రాజు.. నిశ్చితార్థం రోజే పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు అతన్ని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని విచారించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి.


ఇవి కూడా చదవండి..

దుప్పటి కప్పుకొని పడుకున్న వ్యక్తి.. లోపలికి దూరిన కింగ్ కోబ్రా.. చివరకు..

ఎయిర్‌పాడ్స్‌ను ఎలా వాడుతున్నారో చూస్తే..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - May 23 , 2025 | 09:31 AM