ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Srisailam Flood Water: శ్రీశైలం జలాశయానికి పోటెత్తిన వరద..

ABN, Publish Date - Sep 22 , 2025 | 08:38 AM

శ్రీశైలం జలాశయానికి 10 స్పిల్‌ వే గేట్లను ఎత్తి నాగార్జునసాగర్‌కు వరద నీటిని విడుదల చేశారు. శ్రీశైలం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 884.10 అడుగులకు చేరింది.

1/6

శ్రీశైలం జలాశయానికి భారీగా వరద పొటెత్తింది. జూరాల, సుంకేసుల ప్రాజెక్టుల నుంచి వరద భారీ ప్రవహిస్తోంది. ప్రస్తుతం ఎగువ పరివాహక ప్రాంతాల నుంచి వరద ప్రవాహం ఎక్కువగా ఉన్నందున, శ్రీశైలం జలాశయానికి భారీ ఇన్‌ఫ్లోలు వస్తున్నాయి.

2/6

ప్రాజెక్టు 10 గేట్లను ఎత్తి నీటిని దిగువన నాగార్జునసాగర్‌కు వదులుతున్నారు. పరిస్థితిని అదుపు చేసేందుకు, నీటిని బయటకు విడుదల చేయడానికి అధికారులు గేట్లను ఎత్తారు. కర్ణాటక, మహారాష్ట్ర వంటి ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవడం వల్ల జలాశయంలోకి నీటి ప్రవాహం పెరుగుతోంది.

3/6

పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటరీ నుంచి 30,000 క్యూసెక్కులు, ఎడమ గట్టు విద్యుత్‌ కేంద్రం నుంచి 35,315 క్యూసెక్కులు, కుడిగట్టు విద్యుత్‌ కేంద్రం నుంచి 30,311 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.

4/6

శ్రీశైలం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 884.10 అడుగులకు చేరింది.

5/6

జూరాల నుంచి 2,32,294, క్యూసెక్కుల నుంచి 4,479, హంద్రీ నుంచి 250 క్యూసెక్కుల ప్రవాహం ప్రాజెక్టులోకి వచ్చి చేరుతోంది.

6/6

ఈ నేపథ్యంలో శ్రీశైలం జలాశయానికి పర్యాటకులు క్యూ కడుతున్నారు. కృష్ణానదిలో వరదలు పెరిగి, శ్రీశైలం జలాశయం గేట్లు తెరవడంతో పర్యాటకులు అధిక సంఖ్యలో వస్తున్నారు. శని, ఆదివారాల్లో యాత్రికుల రద్దీ మరింతగా ఉంటుందని అధికారులు తెలిపారు.

Updated Date - Sep 22 , 2025 | 08:41 AM