Congress Janhita Padayatra: వరంగల్ జిల్లాకు చేరిన కాంగ్రెస్ జనహిత పాదయాత్ర.. పాల్గొన్న అగ్రనేతలు
ABN, Publish Date - Aug 26 , 2025 | 08:01 AM
తెలంగాణ కాంగ్రెస్ చేపట్టిన జనహిత పాదయాత్ర వరంగల్ జిల్లాకు సోమవారం నాడు చేరుకుంది. ఇల్లంద నుంచి వర్థన్నపేట వరకు జనహిత పాదయాత్ర కొనసాగింది. ఈ పాదయాత్రలో మీనాక్షి నటరాజన్, మహేష్ కుమార్ గౌడ్, మంత్రి కొండా సురేఖ, వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి, కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు.
తెలంగాణ కాంగ్రెస్ చేపట్టిన జనహిత పాదయాత్ర వరంగల్ జిల్లాకు సోమవారం నాడు చేరుకుంది.
ఇల్లంద నుంచి వర్థన్నపేట వరకు జనహిత పాదయాత్ర కొనసాగింది.
ఈ పాదయాత్రలో మీనాక్షి నటరాజన్, మహేష్ కుమార్ గౌడ్, మంత్రి కొండా సురేఖ, వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి, కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు.
కాంగ్రెస్ చేపట్టిన జనహిత పాదయాత్రలో భారీగా పాల్గొన్న నేతలు, కార్యకర్తలు
పాదయాత్రలో ప్రజా సమస్యలను టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అడిగి తెలుసుకున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతున్న విధానంపై అడిగి మహేష్ కుమార్ గౌడ్ తెలుసుకున్నారు.
ప్రజా సమస్యల పరిష్కారానికి తమ ప్రభుత్వం కృషి చేస్తోందని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు.
కేంద్ర ఎన్నికల సంఘం తమ చేతుల్లో లేదని చెప్పుకొచ్చారు. దొంగ ఓట్లపై తామెలా లెక్కలు తేలుస్తామని ప్రశ్నించారు మహేష్ కుమార్ గౌడ్.
బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉందని..మీరే లెక్కలు తేల్చాలని మహేష్ కుమార్ గౌడ్ సవాల్ చేశారు.
Updated Date - Aug 26 , 2025 | 08:05 AM