Telangana Cabinet Expansion: రాజ్‌భవన్‌లో నూతన మంత్రుల ప్రమాణ స్వీకారం
ABN, Publish Date - Jun 09 , 2025 | 07:50 AM
సుదీర్ఘకాలంగా వాయిదా పడుతూ వచ్చిన రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ ఎట్టకేలకు జరిగింది. క్యాబినెట్‌లో ఖాళీగా ఉన్న ఆరు స్థానాల్లో.. తొలి విడతగా మూడింటిని భర్తీ చేశారు. మూడు బెర్తులనూ తొలిసారి ఎమ్మెల్యేలుగా గెలిచిన వారికే కట్టబెట్టారు. ఈ మేరకు ముగ్గురు కొత్త మంత్రులు ఆదివారం పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్ దర్బార్ హాల్‌లో నిరాడంబరంగా జరిగిన కార్యక్రమంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ నూతన మంత్రులతో ప్రమాణం చేయించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమక్షంలో.. గడ్డం వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, వాకిటి శ్రీహరి మంత్రులుగా ప్రమాణం చేశారు.
Updated Date - Jun 09 , 2025 | 07:55 AM