ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad Heavy Rains: హైదరాబాద్‌ను ముంచెత్తిన భారీ వర్షం..

ABN, Publish Date - Sep 23 , 2025 | 07:56 AM

హైదరాబాద్ నగర వ్యాప్తంగా నిన్న(సోమవారం) భారీ వర్షం కురిసింది. ఎగధాటిగా రెండు, మూడు గంటల పాటు నగరం మొత్తం భారీ వర్షం పడింది. దీంతో నగరమంత అస్తవ్యస్తం అయిపోయింది. జనజీవనం స్తంభించిపోయింది. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కున్నారు. కాలనీలు జలదిగ్భందం అయ్యాయి. లోతట్టు ప్రాంతాలు చెరువులను తలపించాయి. రోడ్లన్నీ జలమయం కావడంతో.. రవాణా వ్యవస్థ నిలిచిపోయింది. వెంటనే అప్రమత్తమైనా అధికార యంత్రాంగం సహాయక చర్యలు చేపట్టారు.

1/6

రాజధాని హైదరాబాద్‌లో కురుసిన భారీ వర్షంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు వణికిపోయారు. సోమవారం సాయంత్రం 2 గంటల పాటు కురిసిన కుండపోత వర్షంతో ప్రధాన రహదారులు చెరువులను తలపించగా, లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి.

2/6

బంజారాహిల్స్‌లో 10 సెం.మీ వర్షపాతం రికార్డు కాగా, దేవరకొండ బస్తీ నీట మునిగింది. వనస్థలిపురంలో హైదరాబాద్‌- విజయవాడ జాతీయ రహదారిపై మోకాళ్ల లోతు వరద నీటితో కి.మీ మేరకు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.

3/6

పలు ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం పడింది. గచ్చిబౌలి, మాదాపూర్, హైటెక్‌సిటీ, నిజాంపేట్, కూకట్‌పల్లి, మణికొండ, ఫిలింనగర్, మెహదీపట్నం, మాసబ్ ట్యాంక్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌‌లో వర్షం దంచికొట్టింది.

4/6

భారీ వర్షం కారణంగా ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి. వాహనదారులు తీవ్ర ఇక్కట్లు పడ్డారు. అలాగే పలు చోట్ల మ్యాన్ హోల్స్ పొంగిపొర్లాయి.

5/6

జనజీవనం స్తంభించిపోయింది. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కున్నారు. కాలనీలు జలదిగ్భందం అయ్యాయి. లోతట్టు ప్రాంతాలు చెరువులను తలపించాయి.

6/6

నగరంలో కురిసిన భారీ వర్షాలకు.. జీహెచ్ఎంసీ, హైడ్రా, DRF, ట్రాఫిక్ సిబ్బందిని IMD అప్రమత్తం చేసింది. రాబోయో రెండు, మూడు రోజుల్లో కూడా నగరంలో భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఈ మేరకు ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.

Updated Date - Sep 23 , 2025 | 07:58 AM