Jubilee Hills ByPoll: నవీన్ యాదవ్ గెలుపుతో ఆకాశాన్నంటిన సంబరాలు
ABN, Publish Date - Nov 14 , 2025 | 01:59 PM
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ భారీ మెజార్టీతో గెలుపొందడంతో మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకట్ స్వామి, వాకిటి శ్రీహరి ఇతర ముఖ్య నేతలు సంబరాలు చేసుకున్నారు. మంత్రులు, ముఖ్య నేతలు ఒకరికొకరూ స్వీట్లు తినిపించుకొని శుభాకాంక్షలు చెప్పుకున్నారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ భారీ మెజార్టీతో గెలుపొందడంతో మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకట్ స్వామి, వాకిటి శ్రీహరి ఇతర ముఖ్య నేతలు సంబరాలు చేసుకున్నారు.
మంత్రులు, ముఖ్య నేతలు ఒకరికొకరూ స్వీట్లు తినిపించుకొని శుభాకాంక్షలు చెప్పుకున్నారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ 24,658 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
ప్రతిరౌండ్‌లోనూ ఆధిక్యం ప్రదర్శించింది కాంగ్రెస్.
నవీన్ యాదవ్ గెలుపు కోసం ఎంతగానో కష్టపడి పనిచేశామని మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి గుర్తుచేసుకున్నారు.
ఈ సందర్భంగా నవీన్ యాదవ్ గెలుపుతో హస్తం పార్టీ శ్రేణులు సంబురాల్లో మునిగిపోయాయి. గాంధీభవన్ వద్ద భారీ బాణాసంచా కాల్చి ఆ పార్టీ నేతలు సందడి చేశారు.
ఉప ఎన్నికలో కాంగ్రెస్ విజయం నేపథ్యంలో మంత్రి పొన్నం ప్రభాకర్‌కి పూల బొకే అందజేస్తున్న కాంగ్రెస్ నేతలు.
కాంగ్రెస్ నేతలకు స్వీట్లు తినిపిస్తున్న మంత్రి పొన్నం ప్రభాకర్.
Updated Date - Nov 14 , 2025 | 02:05 PM