CM Revanth Reddy: కవి అందెశ్రీ సంస్మరణ సభ.. హాజరైన సీఎం రేవంత్‌రెడ్డి
ABN, Publish Date - Nov 23 , 2025 | 11:29 AM
తెలంగాణ రాష్ట్ర గీత రచయిత అందెశ్రీ సంస్మరణ సభ శనివారం నాడు రవీంధ్ర భారతిలో జరిగింది. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అందెశ్రీ సేవలను గుర్తుచేసుకున్నారు. అందెశ్రీకి నివాళి అర్పించారు.
తెలంగాణ రాష్ట్ర గీత రచయిత అందెశ్రీ సంస్మరణ సభ శనివారం నాడు రవీంధ్ర భారతిలో జరిగింది.
ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా అందెశ్రీ సేవలను గుర్తుచేసుకున్నారు. అందెశ్రీకి నివాళి అర్పించారు.
కవి అందెశ్రీ.. అక్షర వాహినితో ‘నిప్పుల వాగు’ను పారించి… మాయమైపోతున్న మనిషిని మనిషికి తిరిగి పరిచయం చేశారని ప్రశంసించారు సీఎం రేవంత్‌రెడ్డి.
తెలంగాణ అస్థిత్వ పోరులో ఊరూరా ‘జయ జయహే తెలంగాణ’ గళమై వినిపించారని కొనియాడారు సీఎం రేవంత్‌రెడ్డి.
తెలంగాణ ఉద్యమ అణిచివేతపై, నియంతృత్వ పాలనపై నిరసన గళాన్ని ఎక్కు పెట్టి అందెశ్రీ పోరాడారని తెలిపారు సీఎం రేవంత్‌రెడ్డి.
అందెశ్రీ చివరి ఊపిరి వరకు తెలంగాణకు అండగా నిలిచారని చెప్పుకొచ్చారు. అందెశ్రీ తన యాదిలో ఎప్పటికీ మెదులుతూనే ఉంటారని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.
Updated Date - Nov 23 , 2025 | 11:34 AM