Saraswati Pushkaralu 2025: సరస్వతీ పుష్కరాలను ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు
ABN, Publish Date - May 15 , 2025 | 09:58 AM
భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం త్రివేణి సంగమంలో గణపతి పూజతో సరస్వతీ పుష్కరాలు గురువారం నాడు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు దంపతులు పుష్కర స్నానం చేశారు. ఈ కార్యక్ర మంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, హై కోర్టు న్యాయమూర్తి సూరపల్లి నంద పాల్గొన్నారు. ఇవాళ తెల్లవారుజామున 5.44 నిమిషాలకు మాధవానంద సరస్వతి పుష్కర స్నానం ప్రారంభించారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం వద్ద త్రివేణి సంగమంలో గురువారం తెల్లవారుజాము నుంచి సరస్వతీ పుష్కరాలు ప్రారంభం అయ్యాయి.
మదనానంద సరస్వతి పీఠాధిపతి మాధవానంద సరస్వతి ఈ పుష్కరాలకు అంకురార్పణ చేశారు.
గురువారం ఉదయం 5.44 గంటలకు ప్రారంభమైన పుష్కరాలు ఈ నెల 26వ తేదీ వరకు 12 రోజుల పాటు వైభవంగా జరుగనున్నాయి.
ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు దంపతులు గురువారం నాడు పుష్కర స్నానం చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, హై కోర్టు న్యాయమూర్తి సూరపల్లి నంద, తదితరులు పాల్గొన్నారు.
సరస్వతీ పుష్కరాల కోసం భక్తులు భారీగా తరలి వస్తున్నారు.
భక్తులు పుష్కర స్నానాలు చేసిన అనంతరం కాళేశ్వర-ముక్తీశ్వర స్వామివారిని దర్శించుంటున్నారు.
పుష్కరాల నేపథ్యంలో కాళేశ్వరంలోని ముక్తీశ్వర క్షేత్రాన్ని ఆలయ అధికారులు సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు.
పుష్కరాల కోసం రూ.35 కోట్లతో తెలంగాణ ప్రభుత్వం భారీగా ఏర్పాట్లు చేసింది.
సరస్వతీ పుష్కరాల కోసం తెలంగాణ, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాక, తమిళనాడు రాష్ట్రాల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు.
పుష్కరఘాట్లు, తాగునీటి వసతి, రోడ్ల మరమ్మతులు, పార్కింగ్, పారిశుద్ధ్యానికి దేవాదాయశాఖ ప్రాధాన్యం ఇచ్చింది.
ఎండల తీవ్రత ఉన్నందున టెంట్లు, పందిళ్లతో భక్తులకు ప్రభుత్వం సకల ఏర్పాట్లు చేసింది. సరస్వతీ పుష్కరాలతో కాళేశ్వరం త్రివేణి సంగమం భక్తులతో రద్దీగా మారింది.
Updated Date - May 15 , 2025 | 11:19 AM