Gangamma Jathara 2025: 900 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ జాతర గురించి మీకు తెలుసా
ABN, Publish Date - May 08 , 2025 | 07:19 AM
తిరుపతిలోని శ్రీ తాతయ్య గుంట గంగమ్మ జాతరకు 900 ఏళ్ల చర్రిత ఉంది. ప్రతీ ఏడాది మే నెలలో ఏడు రోజుల పాటు జాతరను వైభవంగా నిర్వహించటం ఆనవాయితీగా వస్తోంది. గంగమ్మ జాతరకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. అయితే ఈ జాతరను రాష్ట్ర పండుగగా ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. బుధవారం నాడు జాతర ఘనంగా ప్రారంభమైంది. ఈ జాతరలో బైరాగి వేషంలో భక్తులు గంగమ్మకు మొక్కులు చెల్లించుకున్నారు. బుధవారం నుంచి ఈనెల 14వ తేదీ వరకు ఈ జాతర అత్యంత వైభవంగా జరుగనున్నది.
తిరుపతిలోని శ్రీ తాతయ్య గుంట గంగమ్మ జాతరకు 900 ఏళ్ల చర్రిత ఉంది.
ప్రతీ ఏడాది మే నెలలో ఏడు రోజుల పాటు జాతరను వైభవంగా నిర్వహించటం ఆనవాయితీగా వస్తోంది.
గంగమ్మ జాతరకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. అయితే ఈ జాతరను రాష్ట్ర పండుగగా ఏపీ ప్రభుత్వం ప్రకటించింది.
జాతరకు ముందు బుధవారం ఉదయం 7 గంటలకు గంగమ్మ ఆలయంలోని విశ్వరూప స్థూపానికి పరిమళ, పవిత్ర జలాలతో అభిషేకం చేసి వడిబాల కట్టడంతో జాతర ప్రాధాన్యత సంతరించుకుంటుంది.
ఈ జాతరలో బైరాగి వేషంలో భక్తులు గంగమ్మకు మొక్కులు చెల్లించుకున్నారు.
బుధవారం నుంచి ఈనెల 14వ తేదీ వరకు ఈ జాతర అత్యంత వైభవంగా జరుగనున్నది.
బుధవారం నుంచి రోజుకో వేషంలో గ్రామదేవతకు భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు.
ఏడు రోజుల పాటు జరిగే ఈ జాతరకు వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు తిరుపతికి తరలివస్తున్నారు.
వేలాది మంది భక్తులు చిత్ర, విచిత్ర వేషాలు ధరించి అమ్మవారిని దర్శించుకుంటారు.
కాగా పుష్ప- 2 సినిమాలోనూ సినీ నటుడు అల్లు అర్జున్ స్త్రీ పాత్ర వేషధారణలో కనిపించిన విషయం తెలిసిందే. గంగమ్మ జాతరకు సంబంధించిన కొన్ని సీన్లు ఈ సినిమాలో కనిపిస్తాయి.
7వ తేదీ బైరాగి వేషంతో జాతర మొదలై బండవేషం, తోటివేషం, దొరవేషం, మాతంగివేషం వరకు పలు వేషాలతో ఈ జాతర సాగుతుంది.
భక్తులు తారతమ్యం లేకుండా పలు వేషాలు వేయడానికి పోటీపడతారు.
12వ తేదీ సున్నపుకుండల వేషాలను ఇద్దరు కైకాల కులస్తులు వేస్తారు. వీరు చిన్న గంగమ్మ, పెద్ద గంగమ్మలకు ప్రతీకలుగా భక్తులచేత పూజలు అందుకుంటారు.
13వ తేదీ మంగళవారం అసలు జాతర సంబరం ప్రారంభమవుతుంది.
అమ్మవారికి ప్రత్యేక అభిషేకానంతరం వజ్రకిరీటంలో దర్శనమిచ్చే గంగమ్మను దర్శించుకునేందుకు భక్తులు అధికసంఖ్యలో ఆలయానికి పోటెత్తుతారు. విశేషంగా పొంగళ్లు, జంతుబలులు అమ్మవారికి మొక్కుగా చెల్లిస్తారు.
గంగమ్మ ఆలయం ముందు విశ్వరూప స్థూపానికి బంకమన్నుతో అమ్మవారి విశ్వరూపాన్ని తయారు చేస్తారు.
14వ తేదీ వేకువజామున విశ్వరూప ప్రతిమ చెంప తొలగించడంతో జాతర పరిసమాప్తమవుతుంది.
అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ జాతరను పండుగ వాతావరణంలో నిర్వహించాలని తిరుపతి కలెక్టర్ ఆదేశించారు.
భక్తుల రద్దీకి అనుగుణంగా భద్రతా ఏర్పాట్లు చేయాలని తిరుపతి ఎస్పీ ఆదేశించారు.
తిరుపతి కలెక్టర్, ఎస్పీ ఆలయాన్ని పరిశీలించి, సంబంధిత అధికారులకు, పోలీసులకు తగు సూచనలు ఇచ్చారు.
ఈ జాతరతో తిరుపతి పుర వీధులన్నీ గంగమ్మ పునకాలతో హోరెత్తుతున్నాయి. అయితే.. ఈ జాతర జరిగినన్ని రోజులు గ్రామస్తులు ఊరి విడిచి వెళ్లకూడదని విశ్వసిస్తారు.
ఆలయ ప్రాంగణం విద్యుత్ దీప కాంతులతో శోభాయమానంగా కనిపిస్తోంది.
Updated Date - May 08 , 2025 | 07:53 AM