Varalakshmi Vratam: వరలక్ష్మీ వ్రత మహోత్సవం.. చార్మినార్ వద్ద భక్తుల సందడి..
ABN, Publish Date - Aug 08 , 2025 | 02:20 PM
వరలక్ష్మీ వ్రతం సందర్భంగా హైదరాబాద్‌లోని ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శ్రావణ శుక్రవారం కావడంతో చార్మినార్, భాగ్యలక్ష్మీ ఆలయాలకు భక్తులు పోటెత్తారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ వరలక్ష్మీ వ్రత వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.
హైదరాబాద్ నగరంలోని చార్మినార్ వద్ధ ఉన్న భాగ్యలక్ష్మీ అమ్మవారి దర్శనం కోసం భక్తులు పోటెత్తారు.
శ్రావణ శుక్రవారం నాడు ప్రత్యేక అలంకరణలో ఉన్న భాగ్యలక్ష్మీ అమ్మవారికి పూజలు నిర్వహించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. చార్మినార్ పరిసర ప్రాంతాలన్నీ క్యూలైన్లతో నిండిపోయి ఉన్నాయి.
నగరంలోని అష్టలక్మీ దేవాలయంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా వరలక్ష్మీ వ్రత వేడుకల వైభవంగా జరిగాయి.
అష్టలక్మీ దేవాలయంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా కుంకుమార్చన పాల్గొన్న భక్తులు.
అష్టలక్ష్మీ దేవాలయంలో అమ్మవారి దర్శనం కోసం భక్తులు క్యూ కట్టారు.
Updated Date - Aug 08 , 2025 | 02:20 PM