International Yoga Day: విశాఖ ఆర్కేబీచ్‌లో మంత్రుల యోగా ప్రాక్టీస్
ABN, Publish Date - May 24 , 2025 | 09:39 AM
International Yoga Day: విశాఖపట్నం ఆర్కే బీచ్‌లో జూన్ 21న జరిగే యోగా డే సందర్భంగా ఈరోజు (శనివారం) ఆర్కే బీచ్‌లో హోంమంత్రి అనిత, మంత్రి డోలా బాల వీరాంజేయస్వామి యోగా ప్రాక్టీస్ చేస్తున్నారు.
ఇంటర్నేషనల్ యోగా డేను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది.
ఈనెల 21 నుంచి నెల రోజుల పాటు యోగాంధ్ర-2025 పేరుతో ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
విశాఖపట్నం రామకృష్ణ బీచ్‌లో జూన్ 21న అంతర్జాతీయ యోగా డే నిర్వహించనున్నారు.
జూన్ 21న జరిగే యోడే సందర్భంగా ఆర్కే బీచ్‌లో హోంమంత్రి అనిత, మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి యోగా ప్రాక్టీస్ చేస్తున్నారు.
యోగాడే కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
11 వ యోగ వేడుకలు విశాఖలో నిర్వహించడం మన అదృష్టమని హోంమంత్రి అనిత అన్నారు.
వచ్చే నెల 21న జరగబోయే యోగాడేకు ప్రధాన మంత్రి మోదీ హాజరు కాబోతున్నారని మంత్రి తెలిపారు.
రోజుకి ఒక గంట సమయం కేటాయిస్తే, రోజంతా ఎనర్జిటిక్‌గా ఉంటామని హోంమంత్రి పేర్కొన్నారు.
ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు అంత ఎనర్జిటిక్‌గా పని చేస్తున్నారంటే యోగానే కారణమని హోంమంత్రి అనిత తెలిపారు.
Updated Date - May 24 , 2025 | 09:41 AM